BigTV English

ChatGPT in Drug Discovery: డ్రగ్ డిస్కవరీలో చాట్‌జీపీటీ.. సమయాన్ని సేవ్ చేయడానికి..

ChatGPT in Drug Discovery: డ్రగ్ డిస్కవరీలో చాట్‌జీపీటీ.. సమయాన్ని సేవ్ చేయడానికి..
ChatGPT in Drug Discovery

ChatGPT in Drug Discovery : మనుషులలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు తగినట్టుగా టెక్నాలజీ కూడా వాటికి పరిష్కారాలను వెతకడంలో నిమగ్నమయ్యి ఉంది. శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతూ ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను చికిత్సను కనుక్కున్నారు. కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఫార్మసీ రంగం మాత్రం ఇంకాస్త వెనకబడే ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ డిస్కవరీ విషయంలో కూడా శాస్త్రవేత్తలు వేగాన్ని పెంచాలి అని సూచిస్తున్నారు.


ఒక వ్యాధికి మందులు కనుక్కోవాలంటే ముందుగా ఆ వ్యాధి గురించి క్షుణ్ణంగా స్టడీ చేయాలి. ఆపై ఆ మందులోని కాంపౌండ్స్ అనేది అన్ని విధాలుగా పేషెంట్లకు హాని కలిగించకుండా ఉన్నాయా లేదా పరీక్షించాలి. ఇలా.. ఒక డ్రగ్ మోడల్ దగ్గర నుండి దాని తయారీ, టెస్టింగ్ వరకు జరిగే ప్రక్రియ చాలా సమయంతో కూడుకున్నది. ఈ సమాయాన్ని తగ్గించడం కోసమే శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. తాజాగా ఒక కొత్త మోడల్ అనేది వారికి డ్రగ్ డిస్కవరీలో పట్టే సమయాన్ని తగ్గిస్తుందని తెలుసుకున్నారు.

గత కొన్నేళ్లుగా కంప్యూటేషనల్ మోడల్స్ సాయంతో డ్రగ్ డిస్కవరీని చేస్తూ వస్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ వాటికి చాలా సమయాన్ని కేటాయించాల్సి వస్తుందని, డ్రగ్ తయారీ కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తుందని వారు తేల్చారు. అందుకే అప్పటినుండి కంప్యూటేషనల్ మోడల్స్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా మరికొన్ని మోడల్స్‌ను కూడా ప్రయత్నించి చూశారు. తాజాగా వారు కనిపెట్టిన ఒక కొత్త మోడల్ అనేది డ్రగ్ డిస్కవరీలో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.


డ్రగ్ డిస్కవరీలో వేగం పెంచడం కోసం ఏఐ సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చాట్‌జీపీటీ అనేది ఎన్నో రంగాల్లో తన సత్తాను చాటుకుంది. ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా ఇటీవల అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ సాయంతోనే కాన్‌ప్లెక్స్ అనే ఒక కొత్త డ్రగ్ డిస్కవరీ మోడల్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీని ద్వారా మందులు తయారు చేసే సమయం చాలావరకు తగ్గిపోతుందని వారు చెప్తున్నారు. ఇంకా ఈ మోడల్‌తో పూర్తిస్థాయిలో వారు మందుల తయారీ ప్రారంభించకపోయినా.. దీని వల్ల ఈ రంగానికి మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×