A Sign in Space project : గ్రహంతరవాసులు అనేవి ఉన్నాయా లేవా..? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలకు సైతం కచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఎంతోకాలంగా ఈ విషయం తెలుసుకోవడానికే పలువురు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఒక్కొక్కసారి భూమిపై నుండి కాకుండా ఇతర గ్రహాల నుండి శాస్త్రవేత్తలకు ఏమైనా సిగ్నల్స్ అందినప్పుడు.. అవి గ్రహంతరవాసుల నుండి వచ్చాయోమో అనే అనుమానం ఉన్నా.. పూర్తిగా కచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారు. తాజాగా అలాంటి సిగ్నల్ వారికి మార్స్ నుండి అందింది.
గ్రహంతరవాసుల నుండి భూమికి అనుకోకుండా సిగ్నల్ వస్తే ఎలా ఉంటుంది? అది తెలుసుకోవడం కోసమే ‘ఏ సైన్ ఇన్ స్పేస్’ ప్రాజెక్ట్‌ను చేపట్టారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతోమంది స్పేస్ సైంటిస్ట్స్, ఆర్టిస్ట్స్ కలిసి పనిచేస్తున్నారు. ఇతర గ్రహాల నుండి వచ్చే సిగ్నల్స్‌ను పరిశోధించడం ఎలా అనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. 2023లో మార్స్‌కు వెళ్లిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ అనేది అంతరిక్షంలోని మరోవైపు నుండి ఒక సిగ్నల్ రూపంలో మెసేజ్‌ను అందుకుంది. అలాంటి ఎన్నో సిగ్నల్స్‌ను స్టడీ చేయడానికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సిద్ధమయ్యింది.
గ్రహంతరవాసులు ఉన్నాయి అని తెలుసుకోవడం మానవాళికి ఎంతో ఆసక్తికరమైన విషయంగా మారుతుంది. కానీ అవి కచ్చితంగా ఉన్నాయి అని చెప్పడం కోసం, అలా అని అలాంటివి అసలు లేవు అని కచ్చితంగా చెప్పడం కోసం కూడా ఎలాంటి ఆధారాలు లేవు. సైన్ ఇన్ స్పేస్ ప్రాజెక్ట్ అనేది ఈ రెండిటిలో ఈ పరిస్థితికి అయినా మానవాళిని సిద్ధం చేయాలని అనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కలిసి గ్రహంతరవాసులు అనేవి ఉంటే ఏం చేయాలి అని ఈ ప్రాజెక్ట్ రూపంలో పరిశోధనలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో ముందుగా మార్స్ నుండి వచ్చిన సిగ్నల్‌ను గ్రహంతవాసులు కనుక్కోనున్నారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్పేస్ ఏజెన్సీలు కలిసి పనిచేయనున్నాయి. ఇప్పటివరకు ఈ సిగ్నల్‌పై పరిశోధనలు జరిగి, అసలు ఇది ఏంటి అని శాస్త్రవేత్తలకు అవగాహన వచ్చినా కూడా దీని గురించి వారు బయటపెట్టడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. పూర్తిగా ఈ సిగ్నల్‌ను డీకోడ్ చేసిన తర్వాతే దీని గురించి బయటపెట్టే ఆలోచనలో శాస్త్రవేత్తలు ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు.