BigTV English

Adani Hindenburg | అడానీ హిండెన్ బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Adani Hindenburg | అడానీ హిండెన్ బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Adani Hindenburg | అడానీ గ్రూపు కంపెనీలపై హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బుధవారం ఈ కేసులో దేశ అత్యున్నత కోర్టు దర్యాప్తు పూర్తి చేయడానికి సెబీ సంస్థకు మూడు నెలల గడువు విధించింది. కోర్టు నిర్ణయం కంపెనీకి అనుకూలంగా రావడంతో అదానీ గ్రూపు కంపెనీ షేర్ల విలువ బుధవారం వేగంగా పెరిగింది.


ఈ కేసులో సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ”సెబీ చేస్తున్న దర్యాప్తులో కలుగుజేసుకోవడానికి ఎటువంటి ఆవశ్యకత లేదు. అడానీ గ్రూపునకు సంబంధించి 22 ఆరోపణలలో సెబీ ఇప్పటివరకు సెబీ 20 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసింది. మిగతా దర్యాప్తు పూర్తిచేసేందుకు మరో మూడు నెలలు ఇస్తున్నాం. హిండెన్ బర్గ్ రిపోర్ట్ లేదా ఇలాంటి ఇతర కేసులలో సెబీ దర్యాప్తు సరిపోతుంది. ప్రత్యేకంగా మరో దర్యాప్తు అవసరం లేదు. చట్ట ప్రకారమే సెబీ పనిచేస్తోంది. సెబీ చేస్తున్న దర్యాప్తు సరిగా జరగడం లేదు అనే దానికి ఆధారాలు లేవు” అని చెప్పింది.

హిండెన్ బర్గ్ ఆరోపణలు ఏమిటి?
అమెరికాకు చెందిన రీసర్చ్ సంస్థ ‘హిండెన్ బర్గ్’ రిపోర్ట్ ప్రకారం.. ప్రముఖ బిలియనీర్, బడా వ్యాపారవేత్త గౌతమ్ అడానీ.. ”కార్పొరేట్ చరిత్రలోనే” అత్యంత భారీ మోసానికి పాల్పడ్డాడు. కంపెనీ షేర్ల విలువ పెంచుకునేందుకు మోసపూరితంగా షార్ట్ సెల్లింగ్ లాంటి అవకతవకలు చేశాడు. కంపెనీ అకౌంట్స్ అన్నీ ఫేక్ రిపోర్ట్స్ చూపించారు.


కానీ ఈ కేసులో కోర్టు హిండెన్ బర్గ్ రిపోర్ట్‌ని పూర్తిగా నమ్మలేమని అభిప్రాయపడింది. కోర్టు తీర్పుపై గౌతమ్ అడానీ ట్వీట్ చేశారు. ”చివరికి నిజమే గెలిచింది. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికంతా నేను రుణపడి ఉన్నాను. భారత అభివృద్ధి కోసం అడానీ గ్రూప్ కృషి చేస్తూనే ఉంటుంది,” అని ట్వీట్‌లో రాశారు.

Adani Hindenburg, Supreme Court, refuse, interfere, SEBI, probe, Hindenburg report, short selling, fraud, corporate fraud, Gautam Adani,

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×