Salman Khan..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ల అవుతున్నా .. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా, సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం సికందర్ (Sikandar) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఖరీదైన వస్తువులతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక అద్భుతమైన చేతి గడియారంతో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అందరి చూపు ఆయన ధరించిన వాచ్ పైనే ఉండడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ వాచ్ ప్రత్యేకతలు ఇవే..
ఇక అసలు విషయంలోకెళితే..” అయోధ్య రామాలయం, హనుమంతుడు, శ్రీరాముడు, ఇతర పవిత్ర చిహ్నాలతో కూడిన ఒక స్పెషల్ గడియారాన్ని ” సల్మాన్ ఖాన్ ధరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సల్మాన్ ఖాన్ సంస్కృతిని గౌరవించారు అంటూ అభిమానులు కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ ధరించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ విషయానికి వస్తే.. దీనిని రామ జన్మభూమి కాన్సెప్ట్ తో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఫోటోని సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ నీలిరంగు చొక్కా ధరించి కాషాయ రంగు కలిగిన వాచ్ ను చూపిస్తూ “మార్చి 30వ తేదీన థియేటర్లలో కలుద్దాం” అంటూ క్యాప్షన్ కూడా జోడించారు.
సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతంటే..?
ఇకపోతే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న.. ఈ వాచ్ ధర అక్షరాలా రూ.61 లక్షలు. జన్మభూమి రోజ్ గోల్డ్ ఎడిషన్ పేరుతో ఉన్న ఈ వాచ్ లో ముఖ్యంగా హిందూ దేవతల పవిత్ర చిహ్నాలు పొందుపరచడం గమనార్హం. ఈ గడియారాన్ని జాకబ్ అండ్ కో సంస్థ చాలా ప్రత్యేకంగా తయారు చేసింది. ఏది ఏమైనా ఇంత పవిత్రమైన దేవత మూర్తులు పొందుపరిచిన ఈ వాచ్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఇలా ఈ వాచ్ తో దర్శనం ఇవ్వడంతో సికందర్ మూవీ గురించి ప్రమోట్ చేస్తూ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేయడం కోసమే సల్మాన్ ఖాన్ కొత్త స్ట్రాటజీనీ ఫాలో అవుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ ;Shruti Haasan: కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప.. హాట్ బాంబు పేల్చిన శృతిహాసన్..
సల్మాన్ ఖాన్ కెరియర్..
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే టీవీ నటుడిగా, నిర్మాతగా, సినీ నటుడిగా, ఆసియాలోనూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. ఇప్పుడు ఎవరు ఊహించని రేంజ్ లో సార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్.