BigTV English

America and China : అమెరికా, చైనా మధ్య మారనున్న సంబంధాలు..

America and China : అమెరికా, చైనా మధ్య మారనున్న సంబంధాలు..
America and China :

America and China : సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికా, చైనా పోటాపోటీగా ముందుకు వెళుతున్నాయి. అమెరికా అభివృద్ధి చెందిన దేశమే అయినా.. అందులో ఉన్న వనరులు చైనాలో లేకపోయినా.. చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికాకు గట్టి పోటీనిస్తోంది. అందుకే అమెరికా కూడా చైనాపై నిఘా వేసింది. తాజాగా అమెరికా గగనతలంలో ఎగిరిన చైనా స్పై బెలూన్.. మరోసారి ఈ రెండు దేశాల మధ్య చిచ్చును రగిల్చింది.


సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికా, చైనాలాంటి రెండు పెద్ద దేశాలు పోటీపడితే.. ప్రపంచం రెండుగా చీలిపోతుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గ్లోబలైజేషన్ అనేది పూర్తవ్వలేదని, అందుకే అలాంటి ఘటన జరగడం అసాధ్యమని నిపుణులు హామీ ఇస్తున్నారు. ప్రపంచ దేశాలను ఒక్క చోటికి చేర్చిన గ్లోబలైజేషన్ అంత సులువుగా అంతరించదని వారు అంటున్నారు. మామూలుగా ప్రపంచాన్ని ఎదిరించి నిలబడడం అనేది ఏదో ఒక్క దేశానికి అసాధ్యమని వారు చెప్తున్నారు.

చైనాకు కానీ, అమెరికాకు కానీ ఇతర దేశాలు అండగా నిలబడినా.. ప్రపంచానికి ఎదురెళ్లడం అనేది అసాధ్యమని నిపుణులు ప్రకటించారు. ఇప్పటికే దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినడం వల్ల గ్లోబలైజేషన్‌పై ఎఫెక్ట్ పడింది. దాని కారణంగానే వినియోగదారులు నష్టాలను చవిచూస్తున్నారు. అయినా కూడా గ్లోబలైజేషన్ అనేది అంతరించడం అసాధ్యం అని నిపుణులు గట్టిగా చెప్తున్నారు. చైనా చూపిస్తున్న పెత్తనం మెల్లగా ఆవిరైపోతుందని, ఎక్కువకాలం ఉండదని వారు అంటున్నారు.


చైనా నుండి వచ్చిన స్పై బెలూన్.. తమ దేశంలోని మిలిటరీపై నిఘా పెట్టడానికే వచ్చిందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అందుకే చైనా, అమెరికా మధ్య వస్తున్న విబేధాలు కేవలం పొరపాటు వల్ల జరుగుతున్నవే అని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఒక దేశంపై మరో దేశం ఎత్తుకు పైఎత్తు వేస్తుంది అన్న భావనే ఈ పరిస్థితికి దారితీసిందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనా చూపిస్తున్న దూకుడు.. దానిని ఇతర ప్రపంచ దేశాలకు దూరమయ్యేలా చేస్తుందని.. అంతకు మించి గ్లోబలైజేషన్‌లో ఎలాంటి మార్పులు రాలేవని నిపుణులు హామీ ఇస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×