Sankranthi Movies : ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇవాళ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అయ్యింది. మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కలెక్షన్స్ మాత్రం బాగానే వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 12 న బాలయ్య మూవీ, జనవరి 14 న వెంకటేష్ మూవీ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ మూవీస్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫాలో అవుతూ ఏపీ లో ఇకమీదట 1 గంటకు, 4 గంటల షోలకు అనుమతి నిరాకరించింది.. అంతేకాదు రోజుకు 5 షోలకు మించి ఉండకూడదని, అందులో ఒకటి బెనిఫిట్ షోగా చేసుకోవచ్చునని చెప్పింది.. దీంతో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న రెండు సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..
సంక్రాంతి రేసులో ఉన్న మూవీస్..
ప్రతి ఏడాది సంక్రాంతికి అర డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతాయి.. కానీ ఈ ఏడాది మాత్రం కేవలం మూడు, నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అందులో మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.. ఇందులో ఇవాళ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అయ్యింది.. మొదటి రోజు మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. ఇక రెండో రోజు టాక్ మారుతుందేమో చూడాలి.. 500 కోట్లతో మూవీని నిర్మించారు. ఇక మిగిలిన రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కూడా బెనిఫిట్ షోల అనుమతి నిరాకరించ్చినట్లు తెలుస్తుంది..
ఏపీ లో బెనిఫిట్ షోలు ఉండవు..
సంక్రాంతి మూవీలకు సంబందించిన అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేసింది. గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ మూవీలకు టికెట్ ధరలను పెంచుకొనే వెసులుబాటు పై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. జనవరి 4 న ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరలకు మాత్రమే అని స్పష్టం చేసింది. ఇక సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని తెలిపింది.. తాజాగా జారీ చేసిన మెమోతో ఇటు ‘గేమ్ ఛేంజర్’, అటు ‘డాకు మహారాజ్’తో పాటు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు ఉదయం 4గంటల షో ప్రదర్శించడానికి అనుమతి లేదు. అంటే ఆరో షో రద్దయినట్లే.. అయితే ఇప్పటికే బుక్ మై షో లో ఆ టైమ్ కు షోలకు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు నిర్ణయంతో సినిమాల కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది.