E-Paper
Advertisement

APPLE BEAT 3 TOP COMPANIES : టాప్ కంపెనీలకు షాకిచ్చిన ఆపిల్..

APPLE BEAT 3 TOP COMPANIES : టాప్ కంపెనీలకు షాకిచ్చిన ఆపిల్..
Advertisement

APPLE BEAT 3 TOP COMPANIES : ఆపిల్ కంపెనీకి ఎదురేలేకుండా పోతోంది. మూడు దిగ్గజ కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ ను… ఆపిల్ ఒక్కటే అధిగమించింది. నవంబర్ 3 నాటికి అమెజాన్, ఆల్ఫాబెట్, మెటాల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్ 2.306 ట్రిలియన్ల డాలర్లకు చేరితే… ఒక్క యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషనే 2.307 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. దీన్ని బట్టి ఆపిల్ ఏ రేంజ్ లో దుమ్మురేపుతోందో అర్థం చేసుకోవచ్చంటున్నారు… విశ్లేషకులు.

బిజినెస్ ఇన్‌సైడర్ అందించిన డేటా ప్రకారం… గత రెండు సెషన్లలో, యాపిల్ షేర్లు 0.16 శాతం పెరిగాయి. అదే సమయంలో ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్ షేర్లు పడిపోయాయి. మెటా 7.6 శాతం నష్టపోగా, అమెజాన్ 17 శాతం, ఆల్ఫాబెట్ షేర్లు 5.7 శాతం కుంగాయి. దాంతో అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 939.78 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మార్కెట్ క్యాప్ 240.07 బిలియన్ డాలర్లు ఉంటే… గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ 1.126 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడింటి మార్కెట్ క్యాప్ ను కలిపినా… ఆపిల్ అంత లేదు. దాంతో… ఇప్పట్లో ఆపిల్ కు పోటీగా వచ్చే వాళ్లు, సాటిగా నిలిచేవాళ్లూ ఎవరూ లేరంటున్నారు… ఆపిల్ ఫ్యాన్స్.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×