HUGE COST CUTTING IN TWITTER : ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నది మొదలు… సంచలన నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు… ఎలాన్ మస్క్. బ్లూ టిక్ కు నెలవారీ ఛార్జీలు, ఉద్యోగుల తొలగింపు, భారీ లక్ష్యాల విధింపు… ఇలా ఎన్నో విషయాల్లో డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్న మస్క్… ఇప్పడు ఖర్చుల తగ్గింపుపైనా దృష్టిపెట్టాడు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను బాగా తగ్గించాలని సిబ్బందిని ఆదేశించాడు… మస్క్. రోజూ 1.5 మిలియన్ డాలర్ల మేర ఖర్చులు తగ్గించి, పొదుపు చేయాలని మస్క్ చెప్పినట్లు… రాయిటర్స్ వెల్లడించింది. కాస్ట్ కటింగ్ ను గాడిన పెట్టేందుకు… నవంబరు 7ను డెడ్‌లైన్‌గా పెట్టినట్లు సమాచారం. కంపెనీ సర్వర్లు, క్లౌడ్ సేవల ఖర్చులతో పాటు, మొత్తంగా రోజూ 1.5 నుంచి 3 మిలియన్ డాలర్ల మేర, ఏడాదికి 100 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు “డీప్ కట్స్ ప్లాన్”గాపేరు పెట్టాడు. అయితే కీలక సమయాల్లో ట్రాఫిక్ ఎక్కువై, ట్విటర్ డౌన్ కావొచ్చనే భయాలతో… సర్వర్ ప్లేస్‌ను తగ్గించాలా? లేదా? అనే అంశంపై మస్క్ పునరాలోచన చేస్తున్నాడని అంటున్నారు.
మరోవైపు… కంపెనీ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తీసేందుకు మస్క్ నిర్ణయం తీసుకోవడంతో… భవిష్యత్ లో ట్విట్టర్ వెబ్ సైట్, మొబైల్ యాప్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో హెవీ ట్వీట్స్ ట్రాఫిక్ ఏర్పడితే… కాస్ట్ కటింగ్ తో పాటు ఉద్యోగుల తొలగింపు కారణంగా ట్విట్టర్ క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.