E-Paper
Advertisement

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Railway Lines: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బళ్లారి–గుంతకల్ మార్గానికి సంబంధించి ఒక కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రధాన ప్రాంతాల మధ్య కొత్తగా 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

46 కిలోమీటర్లు.. రూ. 1,264 కోట్లు!

Advertisement

ఈ ప్రాజెక్టు కింద బళ్లారి నుండి గుంతకల్ మధ్య ఉన్న 46 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మరింత విస్తరించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,264 కోట్లను కేటాయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు తీవ్ర తీవ్ర ఆలస్యానికి గురవుతున్నాయి. కొత్త లైన్ల వల్ల రైళ్ల సామర్థ్యం పెరిగి, సమయం ఆదా అవుతుంది.

నదులపై మెగా వంతెనలు.. ఇంజనీరింగ్ అద్భుతం

Advertisement

ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా వేదవతి నదిపై అత్యంత కీలకమైన 762 మీటర్ల పొడవైన ఒక మెగా వంతెనను నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ 46 కిలోమీటర్ల పరిధిలో మరో 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

మూడేళ్లలో పూర్తి చేసాలా ప్రణాళిక

ఈ భారీ ప్రాజెక్టును వచ్చే మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు సరుకు రవాణా చాలా సులభతరం కానుంది. ఈ నిర్ణయం పట్ల ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

Big Stories

Advertisement
×