BigTV English

Barack Obama| ట్రంప్ తో పోటీపడి గెలిచే చాన్సులు తగ్గిపోతున్నాయి.. బైడెన్‌కు ఒబామా హెచ్చరిక!

Barack Obama| ట్రంప్ తో పోటీపడి గెలిచే చాన్సులు తగ్గిపోతున్నాయి.. బైడెన్‌కు ఒబామా హెచ్చరిక!

Barack Obama| అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో పోటీపడి ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ గెలిచే అవకాశాలు తగ్గిపోతున్నాయని సీనియర్ డెమొక్రాట్ పార్టీ నాయకులు అయిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది.


ప్రజల్లో బైడెన్ ఇమేజ్ తగ్గిపోతోందని.. దీని వల్ల సెనేటర్, కాంగ్రెస్ నల్ ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం ఉంటుదని వారు వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్‌లో వార్తలొచ్చాయి. ”జో బైడెన్ విజయం సాధించే అవకాశాలు తగ్గిపోయాయి.. ఆయన నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలో? లేదో? మరోసారి ఆలోచించుకోవాలి..” అని ఒబామా చెప్పారని తెలిసింది.

Also Read: కేజీ గోధుమ పిండి రూ.800, వంటనూనె రూ.900.. ‘పాకిస్తాన్ ప్రజలు గడ్డితింటారు కానీ అణు ఆయుధాలు కావాలి’


రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రంప్ ఇమేజ్
జూన్ 27, 2024 న ట్రంప్ తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బైడెన్ మాటలు తడబడ్డాయి, ఆయన ట్రంప్ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆ తరువాత కూడా బైడెన్ చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో మతిమరుపు లక్షణాలు ఉన్నట్లు మాటలు తడబడడం వంటివి కనిపించింది. ప్రస్తుతం బైడెన్ కు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తన డెలావేర్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు.

మరోవైపు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల పెన్సిల్ వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తరువాత ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో అధ్యక్షుడు బైడెన్ పాపులారిటీ విషయంలో తన ప్రత్యర్థి ట్రంప్ కంటే చాలా వెనుకబడ్డారని స్థానిక మీడియా తెలిపింది.

ఈ విషయమే ఒబాయా ప్రస్తావించారు. ఎన్నికల ట్రెండ్ లో బైడెన్ జోరు తగ్గిందని చెబుతూ.. అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడు అయిన ఒబామా.. ట్రంప్ గెలిచే అవకాశాలు పెరిగిపోతున్నాయని.. డెమొక్రాట్స్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విరాళాలు ఇచ్చే వారు తగ్గిపోతున్నారని ఎత్తిచూపారు.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

ఒబామా లాగే మాజీ హౌస్ స్పీకర్, డెమొక్రాట్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ కూడా బైడెన్ పాపులారీటీ తగ్గిపోతుండడంతో.. పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలపై నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారని న్యూ యార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఈ కారణంగా డెమోక్రాట్స్ నాయకులలో విభేదాలు తలెత్తాయని.. పార్టీలో చీలిక కనిపిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనం ద్వారా తెలిసింది.

కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని బహిరంగంగా చెప్పారు.

ఇంత జరుగుతున్నా..బైడెన్ మాత్రం తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోనని పలుమార్లు ప్రకటించారు. బైడెన్ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహకులు కూడా బైడెన్ స్థానంలో మరొకరు డెమోక్రాట్ అభ్యర్థిగా ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×