Big Stories

Brain : బ్రెయిన్‌లో కీలక భాగాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Brain

Brain : మనిషి పెరుగుతున్న క్రమంలో ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు. కానీ కొన్ని విషయాలు నేర్చుకోకుండానే అర్థమైపోతాయి. దానికి కారణం మెదడులో తనకు తెలియకుండా దాగి ఉన్న సమాచారమే. దాని కారణంగానే తను ముందుగా వచ్చే ప్రమాదాలను గుర్తించగలుగుతాడు. అంతే కాకుండా వాటికి దూరంగా కూడా ఉంటాడు. అది అసలు ఎలా సాధ్యమో తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది.

- Advertisement -

ఉష్ణోగ్రతల విషయంలో మన మెదడు చురుగ్గా పనిచేయడానికి కారణం అందులోని ‘థెర్మల్ కార్టెక్స్’ అనే భాగమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మనిషిగా నేచురల్‌గా వచ్చినా.. దానికి సంబంధించిన ఫంక్షన్ మాత్రం థెర్మల్ కార్టెక్స్ నుండే జరుగుతుందని వారు చెప్తున్నారు. వేడి పదార్థాలు కానీ, చల్లటి పదార్థాలు కానీ గుర్తించడం.. వాటి మధ్య తేడా తెలుసుకోవడం.. మానవాళి జీవనానికి ఎంతో ముఖ్యం. దాదాపు ఒక శతాబ్దం నుండి శాస్త్రవేత్తలు.. అసలు ఈ తేడా కనుక్కోవడం మనుషులకు ఎలా సాధ్యపడుతుంది అనే విషయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

- Advertisement -

థెర్మల్ కార్టెక్స్ అనేదే ఈ యాక్షన్‌కు కారణమని కనుగొన్న తర్వాత కూడా మెదడులో అసలు అది ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలకు చాలా సమయంపట్టింది. తాజాగా ఒక ఎలుక మెదడులో థెర్మల్ కార్టెక్స్ ఎక్కడ ఉంటుందో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సైన్స్‌లో చాలా ముఖ్యం. మెదడు ఎలాంటి పరిస్థితులను ఎలా కనిపెడుతుంది అన్న అంశం దానికంటే ముఖ్యం. అందుకే థెర్మల్ కార్టెక్స్‌పై ఇంతకాలం దీర్ఘంగా పరిశోధనలు సాగాయి.

ప్రస్తుతం మెదడుకు సంబంధించిన ఎన్నో వ్యాధులు మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా బ్రెయిన్‌లోని ప్రతీ సెల్‌పై పరిశోధనలు చేస్తే.. చాలా వ్యాధులకు సులువుగా చికిత్సను కనుక్కోవచ్చని శాస్త్రవేత్తుల చెప్తున్నారు. చాలావరకు మెదడు శరీర అవయవాలు చెప్పిన సిగ్నల్స్‌కు అనుగుణంగానే పనిచేస్తాయి. కానీ ఇదంతా బ్రెయిన్‌లోని ఔటర్ లేయర్ అయినా కార్టెక్స్‌లోనే జరుగుతుందని వారు అంటున్నారు. అయితే థెర్మల్ కార్టెక్స్ అనేది శరీరానికి చల్లగాలి తగిలినప్పుడు రియాక్ట్ అవుతుందని గమనించిన పరిశోధకులు.. అలాగే వేడి ఉష్ణోగ్రతకు కూడా రియాక్ట్ అవుతుందని గుర్తించారు.

థెర్మల్ కార్టెక్స్ గురించి స్టడీ చేస్తున్న సమయంలో వారికి ప్రైమరీ సోమసోటరీ కార్టెక్స్ అనే బ్రెయిన్ భాగాన్ని గుర్తించారు. ఇది కేవలం చల్లటి ఉష్ణోగ్రతకు మాత్రమే రియాక్ట్ అవుతుందని.. వేడి వాటికి రియాక్ట్ అవ్వడం లేదని వారు గమనించారు. అయితే ఇలా ఎందుకు అవుతుందని అనే విషయంపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News