EPAPER

Budimi Kaya : మొక్కే కదా అని తీసిపారేయకండి.. ఎన్నో లాభాలు

Budimi Kaya : మొక్కే కదా అని తీసిపారేయకండి.. ఎన్నో లాభాలు

Budimi Kaya : సాధారణంగా మనకు గ్రామాల్లో, రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద చాలా రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ మనం అవేవో పిచ్చి మొక్కలని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ ఈ మొక్కల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఎన్నో మందులు నయం చేయలేని రోగాలను ఇవి తగ్గిస్తాయి. అందులో ఒకటి బుడిమి కాయ మొక్క, దీన్ని బుడ్డ కాయ, కుప్పింటి మొక్క అనే పేర్లతో కూడా పిలుస్తారు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇది చూడడానికి ముదురు ఆకులతో, చిన్న కాయలతో రెండున్నర అడుగుల వరకు పెరుగుతుంది. గ్రామాల్లో ఈ మొక్క కాయలను ఆహారంగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని భావిస్తుంటారు. పండిన ఈ కాయలు టమాటా రుచిలో ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారని మనలో చాలామందికి తెలియదు. ఈ కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కీళ్ల నొప్పులను, మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి, ఆర్థరైటిస్ నొప్పులను నయం చేయడానికి ఈ బుడిమి కాయలు ఎంతగానో సహాయపడతాయి. ఈ పనులను తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో ఉన్న వ్యర్ధాలు అన్ని తొలగిపోయి శుభ్రం అవుతుంది. మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ కాయ తినడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. బుడిమి కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనేక రకాల వైరస్‌ల నుంచి మనల్ని బయటపడేస్తుంది. షుగర్ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందుపరచుకోవచ్చు. ప్రతిరోజు వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. క్యాన్సర్ కణాలను కూడా నశింపజేసే శక్తి ఈ కాయలకు ఉంది. కంటి సంబంధిత సమస్యలను నయం చేయడానికి బుడిమి పండ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు, మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. బీపీతో బాధపడేవారు ఈ బుడిమి కాయలను తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లు పచ్చిగా తినకూడదు. పూర్తిగా పండిన తర్వాత మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొందరికి వీటిని తింటే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకపోవడమే మంచిది. పిచ్చి మొక్కగా భావించే ఈ బుడిమి కాయ మనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×