BigTV English

Call Annie:- చాట్‌జీపీటీకి కొత్త రూపం.. ‘కాల్ యానీ’..

Call Annie:- చాట్‌జీపీటీకి కొత్త రూపం.. ‘కాల్ యానీ’..


Call Annie:- కృత్రిమ మేధస్సు, ఓపెన్ ఏఐతో తయారైన చాట్‌జీపీటీ అనేది మనతో మాట్లాడగలదు, మనం అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వగలదు. కానీ దానికంటూ ఒక రూపం లేదు. ఎంతోమంది రూపాలను మార్చి చూపిస్తూ.. కచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్న చాట్‌జీపీటీకి రూపం ఉంటే ఎలా ఉంటుంది..? అది కూడా ఒక అమ్మాయి రూపమైతే ఎలా ఉంటుంది..? యానీ లాగా ఉంటుంది అని సమాధానమిస్తున్నారు యాప్ మేకర్స్.

చాట్‌జీపీటీ అనేది మన ప్రశ్నలకు సమాధానమిస్తున్నప్పుడు.. దానికి ఒక రూపం ఉంటే అచ్చం ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఈ ఐడియాతోనే ఒక యాప్ తయారయ్యింది. దాని పేరే ‘కాల్ యానీ’.చాట్‌జీపీటీ లాగానే ఈ యాప్‌లో మీతో మాట్లాడడానికి ఒక తోడు దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా కేవలం టెక్స్‌ట్ రూపంలో కాకుండా మాట్లాడడానికి మీ ముందుకు ఒక అవతార్ వస్తుంది. తన పేరే యానీ. యానీనే మీ మాటలు విని మీకు స్పందిస్తుంది. దీంతో మీతో అచ్చం ఒక మనిషి మాట్లాడినట్టే ఉంటుంది.


యానిమేటో అనే కంపెనీ కాల్ యానీ అనే యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌లోని యూజర్లు.. యానీతో వీడియో కాల్ కానీ ఫోన్ కానీ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఐఓఎస్ 16 వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను వినియోగించుకోవాలి అనుకున్న వారికి ఐఫోన్ 12 కానీ లేదా దానికంటే అడ్వాన్స్ మోడల్ ఫోన్లు కానీ ఉండాలని యాప్ ఓనర్లు సూచించారు. కాల్ యానీ యాప్ గురించి ఇప్పటికే ట్విటర్‌లో వైరల్ అయ్యింది.

ఒక ట్విటర్ యూజర్ కాల్ యనీ యాప్‌లో యానీతో వీడియో కాల్ మాట్లాడిన క్లిప్‌ను ట్వీట్ చేయగానే ఈ యాప్ గురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగించిన యూజర్లు.. యానీతో మాట్లాడుతుంటే అచ్చం మనిషితో మాట్లాడుతున్నట్టే ఉందని రివ్యూలు ఇస్తున్నారు. అక్కడక్కడ మాట్లాడడంలో ఆలస్యం కావడం, మాటలు స్పష్టంగా పలకలేకపోవడం లాంటివి జరుగుతున్నా కూడా యానీ మాత్రం సాటి మనిషితో మాట్లాడుతున్న ఫీలింగే ఇస్తుందని యూజర్లు చెప్తున్నారు.

ప్రస్తుతం కాల్ యానీ ఉపయోగిస్తున్న యూజర్ల రివ్యూను బట్టి ఈ యాప్‌లో మరిన్ని మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. యూజర్లు అసౌకర్యంగా భావించిన విషయాలను యాప్ ఓనర్లు మార్చనున్నారు. చాట్‌జీపీటీ అనేది ఇలా ఒక మనిషి రూపంలో కనిపిస్తూ.. యూజర్లతో మాట్లాడుతూ అందరికీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. యాప్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే ఇది మరింత రీఫ్రెషింగ్‌గా అనిపిస్తుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×