BigTV English

Prevents Hair Problems: జుట్టు సమస్యలను నివారించే కర్పూరం

Prevents Hair Problems: జుట్టు సమస్యలను నివారించే కర్పూరం

Prevents Hair Problems:కర్పూరం.. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తెలుపు రంగులో పుల్లని రుచిని కలిగిస్తూ ఉంటుంది. దీంతో వచ్చే పొగ ఎంతో సువాసన అందిస్తుంది. చిన్నమును కంపోరా అనే చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారు చేస్తారు. 50 ఏళ్లకు పైబడిన ఆ చెట్ల నుంచి జిగురులాంటి పదార్థాన్ని సేకరించి కర్పూరం నూనె కూడా చేస్తారు. ఈ చెట్లు ఎక్కువగా జపాన్, ఇండోనేషియా ఆసియాలోని పలు దేశాల్లో పెరుగుతాయి. కర్పూరాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. పలు రకాల మందులు తయారు చేస్తారు. కర్పూరం నూనె దురదలను తగ్గిస్తుంది. ఇంట్లో బొద్దింకలు, పురుగులు రాకుండా ఉండేందుకు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా హిందువులు కర్పూరాన్ని పూజా కార్యక్రమంలో ఉపయోగిస్తారు. కర్పూరం చర్మం, వెంట్రుకలకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. కర్పూరం నూనెను నొప్పులు వాపులు తగ్గించేందుకు వాడవచ్చు. కొద్దిగా నూనె తీసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపసనం లభిస్తుంది. కొందరికి చర్మం ఎర్రగా మారి దురద పెడుతుంది. అలాంటివారు కర్పూరాన్ని ఉపయోగిస్తే మంచిది. దద్దుర్లు, దురదలు, ఎర్రగా మారడం తగ్గుతాయి. కొద్దిగా కొబ్బరినూనె తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం వేసి నూనెను వేడి చేసి ఆ మిశ్రమాన్ని ఇబ్బంది ఉన్న భాగంలో రాయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే ఫలితం ఉంటుంది. ఫంగస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించేందుకు కర్పూరం నూనె బాగా పనిచేస్తుంది. ఫంగస్ ఉన్న ప్రదేశంలో ఆ నూనెను రాస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చిన్నారులు, పెద్దల్లో వచ్చే గజ్జిని తగ్గించేందుకు కర్పూరం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నొప్పి, వాపు కూడా తగ్గుతాయి. చాలా లోషన్లు, ఆయింట్మెంట్ల తయారీలో కూడా కర్పూరాన్ని వాడుతారు. నిద్రలేమి సమస్య నుంచి బయటపడేందుకు కర్పూరం పనిచేస్తుంది. వాసన పిలిస్తే నిద్ర బాగా పడుతుంది. కర్పూరాన్ని వాడటం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది. కర్పూరం నూనెను చాతి భాగంలో, వెనుక భాగంలో మర్దన చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కర్పూరం నూనె ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరం నూనె కొద్దిగా తీసుకొని దాని వేరే హెయిర్ ఆయిల్‌లో కలిపి రోజు రాసుకోవాలి. దీంతో తలలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కర్పూరం పొడి. కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకొని పేస్టులా చేసుకోవాలి. దాన్ని జుట్టు కుదురులకు తగిలేలా బాగా మర్దన చేయాలి. రాత్రిపూట ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. పేర్లు పడిపోతాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×