Big Stories

Car sales increase : విపరీతంగా పెరిగిన కార్ల అమ్మకాలు.. దేనికి సంకేతం

Car sales increase : జనం చిన్న చిన్న కార్లు కొనడం లేదు. తీసుకుంటే పెద్ద బండే తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బస్సులు, కార్లు, బైకలు అన్నీ కలిపి దాదాపు 39 లక్షల యూనిట్లు అమ్ముడుపోతే.. అందులో మెజారిటీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ దే. ఎంట్రీ లెవల్ కార్లు, బైక్‌‌లకు గిరాకీ తగ్గింది.

- Advertisement -

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌-సియామ్‌‌ రిపోర్ట్స్ ప్రకారం..  2022–23లో పర్సనల్ వెహికల్స్ అమ్మకాలు 26.73 శాతం పెరిగాయి. మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి డీలర్లకు వెళ్లిన ప్యాసెంజర్ వెహికల్స్‌‌ గత ఏడాది 38,90,114గా రికార్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు ప్యాసెంజర్ వెహికల్స్ హోల్‌‌సేల్స్‌‌లో ఇదే అత్యధికం అని సియామ్ ప్రకటించింది.

- Advertisement -

ప్యాసెంజర్ వెహికల్ సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం ఎస్‌‌యూవీ వంటి  యుటిలిటీ వెహికల్స్‌‌కు డిమాండ్ పెరగడమే. 2022–23లో ఏకంగా 20,03,718 యూనిట్లు డీలర్లకు సరఫరా అయ్యాయి. అంటే, గతేడాది కంటే 34.55 శాతం గ్రోత్‌‌ నమోదు చేసింది.

ప్యాసెంజర్ వెహికల్స్ సేల్స్ పెరగడం అంటే.. క్లియర్ కట్‌గా కరోనా సంక్షోభం నుంచి,  సప్లయ్‌‌ చెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి ఆటో ఇండస్ట్రీ కోలుకుందనే అర్థం. ఇది ఇండియన్ ఎకానమీకి గుడ్ సిగ్నల్ అని సియామ్‌‌ ప్రెసిడెంట్‌‌ వినోద్ అగర్వాల్ తెలిపారు.

అటు కమర్షియల్‌‌, టూవీలర్ సేల్స్‌‌ కూడా పెరిగాయి. 2022–23లో 9,62,468 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ ప్లాంట్ల నుంచి డీలర్స్‌‌కు వెళ్లాయి. ఇది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌‌లో సెకెండ్ హయ్యస్ట్‌‌ అని గణాంకాలు చెబుతున్నాయి. టూవీలర్‌‌‌‌, త్రీవీలర్‌‌‌‌ , కమర్షియల్ వెహికల్స్‌‌ సేల్స్‌‌ పెరిగినప్పటికీ ఇంకా కరోనా ముందు స్థాయికి చేరుకోలేదని సియామ్‌‌ తెలిపింది.

మొత్తానికి కరోనా కంటే ముందు స్థాయిలకు వెళ్లడానికి ఇండియాకు ఎంతో సమయం పట్టదని, ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చుకుంటే.. ఇండియానే ఎక్కువ గ్రోత్ రేటుతో వెళ్తోందని.. ఈ గణాంకాలు చెబుతున్నాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News