Big Stories

RCB on charge:- అయిపాయె.. బోణీ కొట్టని ఢిల్లీ.. ఈసారి కప్ మనదే..

RCB on charge:- ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు కలిసిరావడం లేదు పాపం. టేబుల్ లో అన్ని జట్లు ఒక విజయాన్నైనా నమోదు చేశాయి ఒక్క ఢిల్లీ తప్ప. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లో.. ఆర్సీబీనే తక్కువ స్కోర్ చేసిందనుకుంటే.. ఢిల్లీ అంతకంటే తక్కువ స్కోర్ ప్లే ఆఫ్ ను కఠినం చేసుకుంది.

- Advertisement -

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. మొదట్లో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. విరాట్ కొహ్లీ ఓపిగ్గా ఉండి.. హాఫ్ సెంచరీ చేసి బలమైన స్కోర్ రావడానికి తన వంతు కృషి చేశాడు. లామ్‌రార్ (26), మ్యాక్స్‌వెల్ (24), డు ప్లెసిస్ (22) పరుగులు చేశారు. మార్ష్ రెండు వికెట్లు, కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్, లలిత్ యాదవ్ చెరో ఒక వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఛేజింగ్ కు దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ చేతికి వచ్చిందంటే కారణం.. ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్న విజయ్ కుమార్ వైశాక్. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఓపెనర్ అండ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బ తీశాడు. ఇక సిరాజ్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్ చెరొక వికెట్లు తీశారు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News