పూలే జయంతిని
మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై హర్షం
⦿ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నాం
⦿ ఇది బీసీల పోరాట విజయం
⦿ సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు
⦿ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, స్వేచ్ఛ: CM Revanth – Savitribai Phule: భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ జీవో విడుదల చేసింది. జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా వేడుకలు జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పలు ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంఘ సంస్కర్త సావిత్రి బాయీ పూలే జయంతి రోజైన జనవరి 3వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో నంబర్ 9ను విడుదల చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇది బీసీల పోరాట విజయంగా బావిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: Rythu Barosa Scheme: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి
బీసీల ఆకాంక్షలను గౌరవించి సావిత్రి బాయి పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప నిర్ణయమని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జయంతి కార్యక్రామలను పెద్ద ఎత్తున నిర్వాహిస్తున్నామని, ఇందులో భాగంగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలు పెద్ద ఎత్తున హాజరు కావాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రేపు జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి pic.twitter.com/oUU3t4ftfq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025