BigTV English

Tumour:-ప్రాణాంతక ట్యూమర్‌కు స్పేస్‌లో సమాధానం..

Tumour:-ప్రాణాంతక ట్యూమర్‌కు స్పేస్‌లో సమాధానం..

Tumour:- టెక్నాలజీ అనేది పెరుగుతున్నకొద్దీ మనుషులను ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అందుకే ఒక వ్యాధి గురించి మళ్లీ మళ్లీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి ట్యూమర్. ఇప్పటికే ఎన్నో రకాల ట్యూమర్లు మనుషులను ఇబ్బంది పెడుతుండగా.. దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అందుకే కొత్త రకం టెక్నిక్‌తో ముందుకు రానున్నారు.


చైల్డ్‌హుడ్ ట్యూమర్ అనేది ప్రాణాంతకమైన ట్యూమర్‌లలో ఒకటి. అందుకే అలాంటి ప్రాణాంతక వ్యాధికి మందును కనిపెట్టడం కోసం కొత్త మార్గంలో వెళ్లాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చైల్డ్‌హుడ్ ట్యూమర్‌ను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసమే దీనికి సంబంధించిన క్యాన్సర్ సెల్స్‌ను స్పేస్‌కు పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. ఛైల్డ్‌హుడ్ ట్యూమర్‌కు దారితీసే మిడ్‌లైన్ గ్లయోమా అనేది మైక్రోగ్రావిటీలో ఎలా వ్యాప్తి చెందుతుందో వారు తెలుసుకోనున్నారు.

డిఫ్యూస్ మిడ్‌లైన్ గ్లయోమా అనేది కూడా ఒక ప్రాణాంతక ట్యూమర్ జాతికి చెందిందే. ముఖ్యంగా ఇది యువతలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. గ్లయోమా అనేది బయటపడిన 18 నెలల్లో పేషెంట్లు చనిపోతూ ఉంటారు. దీనికి చికిత్స అనేది కూడా ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే భూమిపై కాకుండా స్పేస్‌లో గ్లయోమో గురించి పరీక్షలు చేస్తే.. చికిత్సకు ఉపయోగపడే క్లూ ఏమైనా దొరుకుందేమో అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


ప్రస్తుతం మిడ్‌లైన్ గ్లయోమాకు కీమోథెరపీలాంటి చికిత్సలు ఉన్నా.. అది పూర్తిస్థాయిలో పేషెంట్‌ను బ్రతికిస్తుందని గ్యారంటీ ఇవ్వలేము. దీనికి సర్జరీ చేయాలన్నా కూడా గ్లయోమా అనేది మెదడులోని చాలా సెన్సిటివ్ ప్రదేశాల్లోనే ఏర్పడుతుంది. అందుకే సర్జరీ కష్టం. వీటితో పోలిస్తే రేడియోథెరపీ అనేది కాస్త మెరుగ్గా పనిచేసినా.. దాని రిజల్ట్ కూడా లిమిటెడ్‌గానే ఉంటుంది. ఫేమస్ అమెరికన్ ఆస్ట్రానాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూతురు కరెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఈ ట్యూమర్ బారినపడి మరణించిన వారిలో ఒకరు.

1960లో కరెన్ ఆర్మ్‌స్ట్రాంగ్.. మిడ్‌లైన్ గ్లయోమా వల్ల మరణించింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ వ్యాధిని కనిపెట్టడం వరకే శాస్త్రవేత్తలు పరిశోధన ఆగిపోయింది. కానీ దీనిని నయం చేసే మార్గం మాత్రం దొరకలేదు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఈ ట్యూమర్ వల్ల జరిగే నష్టాలను కనిపెట్టగలుగుతున్నాం కానీ చికిత్సను మాత్రం కనిపెట్టలేకపోతున్నామని శాస్త్రవేత్తలు సైతం వాపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌తో కలిసి చేస్తున్న ఈ ప్రయోగం గ్లయోమా గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశంతో పాటు దానికి చికిత్సను కూడా అందిస్తుందని వారు ఆశిస్తున్నారు.

మహిళల్లో పోషకాహార లోపం కనిపెట్టే టూల్..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×