BigTV English

China is ready to launch 70 satellites in 2023 : చైనా మాస్టర్ ప్లాన్.. ఒక్క ఏడాదిలోనే..

China is ready to launch 70 satellites in 2023 : చైనా మాస్టర్ ప్లాన్.. ఒక్క ఏడాదిలోనే..

china is ready to launch 70 satellites in 2023 : చైనాలో అంతరిక్ష పరిశోధనలను వీలైనంతగా అభివృద్ధి చేయాలని ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 2023లో భారీ పరిశోధనలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది 70 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. చైనా ఎరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కాస్క్) ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఏడాది 50కు పైగా లాంచ్‌లు చేయాలని సంస్థ భావిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.


2022 చైనా 64 లాంచ్‌లను జరిపింది. ఈ ఏడాది పలు కమర్షియల్ విభాగాలతో కలిసి కాస్క్, 70 లాంచ్‌లను ప్లాన్ చేసింది. దీని కోసం మూడు స్పేస్‌పోర్ట్‌లను కూడా సిద్ధం చేసింది. అవే కోస్టల్ వెంచాంగ్ స్పేస్‌పోర్ట్, హాయాంగ్ స్పేస్‌పోర్ట్, ఇన్లాండ్ స్పేస్‌పోర్ట్. ఈ ఏడాది కాస్క్ చేపట్టనున్న ముఖ్యమైన లాంచ్‌లలో రెండు షెంజో క్రూడ్ మిషిన్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు పలు సివిల్, మిలిటరీ, సైన్స్, కమర్షియల్‌కు సంబంధించిన మిషిన్స్‌ను కూడా చైనా లాంచ్ చేయనుంది.

లాంగ్ మార్చ్ 6ఏ మైనస్‌కు సంబంధించిన లాంగ్ మార్చ్ 6సీ వేరియంట్ ఈ ఏడాదిలో ముందుగా లాంచ్ కానుంది. అంతే కాకుండా మార్స్‌ను చుట్టడానికి కనిపెట్టిన టైన్‌వెన్ 1ను లాంచ్ చేసిన లాంగ్ మార్చ్ 5 కూడా మరోసారి రంగంలోకి దిగనుంది. లాంగ్ మార్చ్ 5ను తయారు చేసిన చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ (కాల్ట్) మాత్రం ఈసారి దీనిని ఏ పనికి ఉపయోగించనున్నారో బయటపెట్టలేదు. గత రెండేళ్లలో మూడు మూడు స్పేస్ స్టేషన్ పరికరాలను లాంచ్ చేసిన లాంగ్ మార్చ్ 5బీ కూడా మరోసారి ఆకాశంలో ఎగరనుంది. 2023 చివర్లో లాంగ్ మార్చ్ 5బీని ఉపయోగించి స్పేస్‌లోకి ఎన్ని ఎక్కువశాతం శాటిలైట్స్‌ను పంపించగలరని ప్రయోగం చేపట్టనుంది చైనా. అంతే కాకుండా న్యూ జెనరేషన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.


హైపర్‌గాలిక్ ఇంజన్లు లాంగ్ మార్చ్ 2,3,4 నుండి పలు రాకెట్లు ఆకాశంలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కిరోసిన్ ఆక్సిజన్‌తో పనిచేసే కెరోలాక్స్ ఇంజన్లు లాంగ్ మార్చ్ 7, 7ఏ, 8 నుండి కూడా రాకెట్లు కొత్తగా లాంచ్ అవ్వనున్నాయని అంచనా. అంతే కాకుండా మరికొన్ని కెరోలాక్స్ ఇంజన్లు కూడా తయారు చేయాలని కాస్క్ భావిస్తోంది. లాంగ్ మార్చ్ 11, జిలాంగ్ 3లు ఒక్కొక్కటిగా నేల మీద నుండి, సముద్రంలో నుండి లాంచ్ కానున్నాయి.

ప్రస్తుతం చైనా వేసుకున్న ఈ ప్రణాళికలో ఒక్క రాకెట్ ఫెయిల్ అయినా మిగతావాటిపై తీవ్ర ప్రభావమే పడుతుంది. ఏప్రిల్ 2020లో లాంగ్ మార్చ్ ఫెయిల్ అవ్వడం వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కున్న చైనా.. మరోసారి అలా జరగకుండా చూసుకోవడానికి జాగ్రత్తపడుతోంది.

Follow this for more updates :- Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×