BigTV English

ChatGPT:చాట్‌జీపీటీకు పోటీగా చైనా ప్రయత్నం..

ChatGPT:చాట్‌జీపీటీకు పోటీగా చైనా ప్రయత్నం..

ChatGPT:చాట్‌జీపీటీ అనేది టెక్నాలజీ రంగంలో ఒక్కసారిగా సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి టెక్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికీ చాట్‌జీపీటీ ఎన్నో ఫీచర్స్‌లో మెరుగుపడాల్సి ఉన్నా.. కొన్ని విషయాల్లో మాత్రం దీనిని మించిన టెక్నాలజీ లేదంటున్నారు నిపుణులు. అందుకే చైనా కన్ను దీనిపై పడింది. దీనికి మించిన టెక్నాలజీ తయారు చేయాలని సన్నాహాలు చేస్తోంది.


చాట్‌జీపీటీ లాంటి చాట్‌బోట్‌ను తయారు చేయాలని టెక్ పరిశోధకులు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతకాలానికి వారి పరిశోధనలు సక్సెస్ అయ్యి ఇది ప్రజల ముందుకు వచ్చాయి. ఒక మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఈ టెక్నాలజీని చూసి ఇతర టెక్ సంస్థలు అసూయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే వారు కూడా ఇలాంటి ఒక చాట్‌బోట్‌ను తయారు చేయాలనుకుంటున్నారు. ముందుగా చైనాలోని టెన్సెంట్ హోల్డింగ్స్ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది కొంతకాలంగా మార్కెట్లో ఉన్నా దానిని ఉపయోగించి తయారు చేసిన చాట్‌బోట్ అయిన చాట్‌జీపీటీ మాత్రం ఒక్కసారిగా ఏఐ పేరును పాపులర్ చేసింది. మామూలుగా చాట్‌జీపీటీ అనేది చైనాలో ఉండే యూజర్లకు అకౌంట్ క్రియేట్ చేయడానికి యాక్సెస్‌ను అందించడం లేదు. కానీ కొన్ని ఏఐ మోడల్స్ మాత్రం అందరికీ యాక్సెస్‌ను అందించడంతో వీటి ద్వారా చైనా.. చాట్‌జీపీటీ గురించి మరికొన్ని టెక్నికల్ విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది.


చాట్‌జీపీటీకి పోటీగా తమ సొంత టెక్నాలజీని తయారు చేస్తున్నట్టు టెన్సెంట్‌తో పాటు దాని పోటీ కంపెనీలు అయిన ఆలీబాబా గ్రూప్, బైడు ఇన్క్ కూడా ఇప్పటికే ప్రకటించాయి. టెన్సెంట్ మాత్రం ఇప్పటికే తాము తయారు చేసే టెక్నాలజీకి ‘హున్యుయాన్‌ఎయిడ్’ అనే పేరును కూడా ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఏమీ బయటికి రాకుండా టెన్సింట్ జాగ్రత్తపడుతోంది. ఫిబ్రవరి 9న చాట్‌జీపీటీకి పోటీగా టెక్నాలజీని తయారు చేస్తామని ప్రకటించిన టెన్సెంట్.. ఆ తర్వాత సైలెంట్‌గా టెక్నాలజీ తయారీ మొదలుపెట్టింది.

Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఆ సమస్యకు చెక్.. సెండ్ అయిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×