E-Paper
Advertisement

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
Advertisement

Delhi Tension: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఏం జరగబోతోంది? సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేస్తారా? చేస్తే ఆయన వేసిన స్కెచ్ ఏంటి? గతంలో జరిగిన పరిణామాలను క్షుణ్నంగా గమనించిన కేంద్రం, ముందుగా అలర్టయ్యిందా? ఒకవేళ అరెస్టయితే ఏం చెయ్యాలో కూడా తన మద్దతుదారులకు క్లియర్‌గా మెసేజ్ ఇచ్చేశారు అభిజీత్.

సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో శనివారం జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగుతోంది సీజేపీ. నిరసన ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను శాంతియుతంగా నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శనివారం తన పూర్తి ప్రణాళికను వివరించారు. శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయలు దేరుతున్నట్లు వివరించారు. తనను విమానాశ్రయంలో అరెస్టు చేస్తారో.. లేదో ఏమి జరుగుతుందో తెలియదన్నారు. ఒకవేళ తనను అరెస్టు చేస్తే నిరసనకారులు ఏమి చేయాలో ఆయన వివరించారు. అరెస్టు తర్వాత నిరసనలు ఆగకూడదని, దాన్ని విజయవంతం చేయడం ప్రజల బాధ్యతగా చెప్పుకొచ్చారు.

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో పరిస్థితులు

Advertisement

ఢిల్లీకి రైళ్లను కేంద్రం రద్దు చేయడాన్ని అభిజీత్ దీప్కే తప్పుబట్టారు. దీన్ని పౌర హక్కులపై విధించిన ఆంక్షలుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని అన్నారు. ఈ అణచివేతను 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పోల్చారు. 2011లో దేశంలో ఒక ఉద్యమం జరిగిందని, అప్పుడు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను, చిన్న పిల్లలను కొట్టిన సందర్భాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు గొప్పవని నేను చెప్పనని, ఇంత క్రూరంగా లేవన్నారు. మా సంస్థ ఏర్పడి కేవలం మూడు నెలలు మాత్రమే అయ్యిందని, మాకు వనరులు, కార్యకర్తలు ఎవరూ లేరన్నారు. మాకు కేవలం ప్రజల మద్దతు ఉందన్నారు. ప్రజా మద్దతుతో మేము మళ్లీ జంతర్ మంతర్‌కు వెళ్తున్నామని అన్నారు. అక్కడ నిరసన కచ్చితంగా జరుగుతుందని తేల్చేశారు.

అరెస్టు చేస్తే, పూర్తి ప్రణాళిక వివరించిన అభిజీత్

అందుకోసం మేము జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే కారణంతో ముంబైలోని అక్టోబర్ 2న సీజేపీ నిరసనకు అనుమతి నిరాకరించారని అన్నారు. ఇప్పుడు రైళ్లను రద్దు చేసి ఢిల్లీని దిగ్బంధిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో రోడ్లు, మెట్రోలు, రైల్వేలను మూసివేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగుతుందని తేల్చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్లకు పైగా తొలగించిన SIR ను రద్దు చేయాలన్నారు.

Advertisement

ALSO READ: కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

Related News

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

Big Stories

Advertisement
×