Kris Srikkanth On Shivam Dube: వెస్టిండీస్ చేతిలో రెండో టీ20 లో టీమిండియా ఓడిపోయిన క్రమంలో శివమ్ దూబే బౌలింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మనోడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. విరాళంగా శివమ్ దూబే పరుగులు ఇచ్చిన నేపథ్యంలో టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడించిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శివమ్ దూబే బౌలింగ్ పై తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు. అసలు శివమ్ దూబేను ఎందుకు ఆడిస్తున్నారు? వాడికి బౌలింగ్ చేయడం వచ్చా? ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకుంటున్నారని నిలదీశారు. ఏం కర్మరా బాబు..ఒక్క మ్యాచ్ లో మెరిస్తే, ఏడాదంతా వాడ్నే ఆడిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేతకాదు…టీమిండియా ఓటమి కారణం శివమ్ దూబేనే అంటూ క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివమ్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా శివమ్ దూబే రెండు ఓవర్లు వేసి 30 పరుగులు సమర్పించుకున్నాడు. అటు బ్యాటింగ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రమోషన్ ఇచ్చి నాలుగో స్థానంలో పంపించినా కూడా ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో శివమ్ దూబే ప్రదర్శనపై కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత టీ20 జట్టులో శివమ్ దూబేకు ఎందుకు అవకాశం ఇస్తున్నారో తనకు అర్థం కావడంలేదని మండిపడ్డారు. పది మ్యాచ్ లు ఆడితే ఒక్క మ్యాచ్ లో మాత్రమే అతడు రాణిస్తాడని… మిగతా తొమ్మిదింటిలో విఫలమవుతున్నాడని విమర్శలు చేశారు.
బ్యాటింగ్ చేతకాదు… అటు బౌలింగ్ లోనూ దండగే అంటూ మండిపడ్డారు. మరి హార్దిక్ పాండ్యా లాంటి గొప్ప ఆల్రౌండర్ స్థానంలో వచ్చిన శివమ్ దూబే… టీమిండియా కోసం ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తున్నట్టు పరిగెత్తుతాడని హేళన చేశారు. కానీ స్పిన్ బౌలర్ల కంటే స్లోగా బంతులు సంధిస్తాడని సెటైర్లు పేల్చారు కృష్ణమాచారి శ్రీకాంత్. నిన్న 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి టీమిండియాను మొదటి దెబ్బ కొట్టింది శివమ్ దూబేనని వ్యాఖ్యానించారు. శివమ్ దూబేను స్పిన్నర్ లాగా భావించి వెస్టిండీస్ బ్యాటర్లు తుక్కు రేగ్గోకొట్టారని పరువు తీశారు. బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ దళం చాలా బలహీనంగా కనిపిస్తోందని హేళన చేశారు. దీనిపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టాలని క్రిస్ శ్రీకాంత్ కోరారు.