Bengaluru: బెంగుళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా ఆఫీసు బయట భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నిత్యం రద్దీగా ఉండే నగరాల్లో బెంగుళూరు సిటీ ఒకటి. అందులోనూ అక్కడ రోడ్లు చిన్నవిగా ఉండడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ సమయంలో ఎలాంటి చిన్న ఘటనలు జరిగినా దాని ప్రభావం చాలావరకు ఉంటుంది. తాజాగా బెంగుళూరు సిటీలోని బాగలూరు మెయిన్ రోడ్డులో ఉన్న అమెజాన్ కార్యాలయం బయట భారీ పేలుడు చోటు చేసుకుంది. అమెజాన్ ఆఫీసు ముందు ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన అవుట్‌డోర్ రింగ్ మెయిన్ యూనిట్-RMU పేలిపోయింది. ఫలితంగా భారీగా మంటలు ఏర్పడ్డాయి.
అదే సమయంలో అటువైపు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న పలువురు పాదచారులు గాయపడ్డాడు. బుధవారం ఉదయం 9.40 గంటల సమయంలో అమెజాన్ ఆఫీసు గేట్ నంబర్-3 ముందు జరిగింది. గాయపడిన వ్యక్తిని మహమ్మద్ అఫ్రోజ్‌గా గుర్తించారు.అఫ్రోజ్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చేతులకు కాలిన గాయాలకు చికిత్స చేసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డిశ్చార్జ్ చేసినట్టు యలహంక పోలీసులు వెల్లడించారు. అమెజాన్ ఆఫీసు వద్ద ఘటనను ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి, తన పిల్లలను కారులో పాఠశాలలో దింపడానికి వెళ్తుండగా ఆర్‌ఎమ్‌యు పేలుడును ప్రత్యక్షంగా చూశాడు.
ఈ పేలుడు ఘటన దృశ్యాలు అతడి కారు డాష్‌క్యామ్‌లో రికార్డ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ ఉద్యోగి మాట్లాడుతూ. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడటం చూశానని చెప్పాడు. మొదట్లో విద్యుత్ పనులు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావించానని తెలిపాడు. పిల్లలను పాఠశాలలో దింపి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కారులోని డాష్‌క్యామ్ ఫుటేజీని చెక్ చేశానని తెలిపాడు. ఒక వ్యక్తికి చర్మం ఊడిపోయిందని, చాలామంది అక్కడికి చేరుకుని బాధితుడికి సహాయం చేసినట్టు చెప్పాడు. వెనుక సీట్లో కూర్చున్న పిల్లలుఆ పేలుడును చూడలేదని, రోడ్డుపై మరిన్ని ఆర్‌ఎమ్‌యులు ఉన్నాయని చెప్పాడు.
అంతకుముందు రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం బెన్నిగన హళ్లిలోని కోకా-కోలా ఈస్ట్ డిపో సమీపంలో మరో ఘటన జరిగింది. ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12.30 గంటల నుండి ఒంటి గంట మధ్యలో జరిగింది. గాయపడిన బాధితులు నారాయణ్ , అజీమ్ పాషా, చేతన్, లక్ష్మి గా గుర్తించారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందించారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు వెనుక కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు
వరుసగా ఇలాంటి ఘటనలు రెండురోజులుగా జరగడంతో బెంగుళూరు నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఇటీవల కాస్తున్న ఎండలు దీనికి కారణం కావచ్చని అంటున్నారు. ఈ సీజన్ ఎప్పుడు ఈ విధంగా ఎండలు కాసిన సందర్భం లేదని అంటున్నారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్ల మాదిరిగా ట్రాన్స్ ఫార్మర్లు టపాసుల మాదిరిగా పేలుతున్నాయి.
Bengaluru Transformer Blast Outside Amazon Office Leaves Pedestrian Injured
Bengaluru
A transformer box installed on a footpath outside the #Amazon office near Bagalur Cross in northeastern #Bengaluru exploded on Wednesday morning around 9:49 am, injuring a pedestrian walking… pic.twitter.com/zoZxurPj8n
— Yasir Mushtaq (@path2shah) October 7, 2026