E-Paper
Advertisement

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్
Advertisement

Supreme Court: స్వేచ్ఛ బ్యూరో: నేడు ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద కాక్రోచ్​ జనతా పార్టీ నిర్వహించనున్న భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలపై అధికారులు విధించిన ఆంక్షలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. 57మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్​ నెట్​ పై ఆంక్షలను సవాల్​ చేస్తూ సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ ఈ పిటిషన్​ ను దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్​ న్యాయవాదులు కపిల్ సిబల్​, అభిషేక్​ మను సింఘ్వీ, ప్రశాంత్ భూషణ్​, వృందా గ్రోవర్, గోపాల్ శంకరనారాయణన్​ తదితరులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. నేడు సీఈసీకి వ్యతిరేకంగా జరుగనున్న నిరసనల కారణంగా మెట్రో స్టేషన్లను మూసివేయటం, రైళ్ల రద్దు, ఇంటర్ నెట్​ సేవల నిలిపివేత వంటి చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటమే అన్నారు. మొత్తం ఢిల్లీని లాక్‌ డౌన్ చేయడం సరికాదని వాదించారు.

అనుమతి లేని నిరసనలు..

Advertisement

ఈ పిటిషన్​ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల అనంతరం ఛీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్​ స్పందిస్తూ అనుమతులు లేని నిరసనలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుల అనుమతి లేని ఆందోళనలను చట్టబద్దమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. అయితే, నిరసనల దృష్ట్యా రైళ్ల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విచారణ సాధారణ పౌరుల రాకపోకలు, ప్రజా రవాణా సదుపాయాలకు సంబంధించిన అంశాలకే పరిమితం అని స్పష్టం చేశారు. నిరసన తెలిపే ప్రాథమిక హక్కు, నిరసనకారులపై విధించిన ఆంక్షలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్వాహకులు ప్రత్యేకంగా అత్యవసర పిటిషన్​ ను దాఖలు చేయవచ్చని సూచించారు. అయితే, మొత్తం నగరాన్ని మూసివేయటంపై అన్ని పక్షాల వాదనలు వినాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Also Read: బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Tags

Related News

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×