E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న కోసం ఏడుస్తూ ఇంటి ముందు నిలబడి ఏడుస్తుంది. అప్పుడే బయటకు వచ్చిన దీప భోజనం చేద్దురు కానీ రండి అంటూ పిలుస్తూ సుమిత్ర ఏడవడం చూసి ఏమైందని అడుగుతుంది. జ్యోత్స్న రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఇవాళ రాత్రి వరకు ఇంటికి వస్తానని చెప్పింది ఇంకా రాలేదు అని బాధపడుతుంది. భయపడుతుంది. అప్పుడే కార్తీక్‌ వచ్చి రావడం లేట్‌ అయ్యుండొచ్చు.. ఫోన్‌లో చార్జింగ్‌ లేక స్విచ్చాప్‌ అయ్యుండొచ్చు ఇంకా ఏదైనా కారణం అయ్యుండొచ్చు అత్తా నువ్వేం కంగారుపడకు అంటాడు. అదైతే సరే కానీ మరేదైనా అయితే ఏంటి అంటూ భయపడుతుంది. అలా ఏమీ ఉండదు.. దీప నువ్వు వెళ్లి భోజనం తీసుకురాపో అని చెప్పగానే.. దీప లోపలికి వెళ్లిపోతుంది.

ఇంట్లో ఇరిటేటింగ్‌గా తిరుగుతున్న సూరజ్‌.. తన మెసేజ్‌ లకు జ్యోత్స్న రిప్లై ఇవ్వలేదని కోపంగా మరోసారి ఫోన్‌ తీసుకుని వాయిస్‌ మెసేజ్‌ చేస్తాడు. నీలాంటి మనిషి నాకు పీఏగా కూడా అవసరం లేదు గుడ్‌బై అంటూ మెసేజ్ చేస్తుంటే. దక్షిణమూర్తి నవ్వుతూ వచ్చి మళ్లీ జ్యోత్స్సేనా అంటాడు. సూరజ్‌ కోపంగా నువ్వేంటి నవ్వుతున్నావు నా ముఖంలో సీరియస్‌ నీకు కనిపించడం లేదా..? అంటాడు. కనిపించేది మాత్రమే చూసే వయసు నీది. కనిపించనిది కూడా అర్థం చేసుకునే వయసు నాది అంటాడు దక్షిణమూర్తి. ఇద్దరి మధ్య జ్యోత్స్న గురించి చర్చ జరుగుతుంది. జ్యోత్స్నను ఎందకు ఆఫీసులో పెట్టావని సూరజ్‌ ప్రశ్నిస్తే.. మరి నువ్వెందుక సంతకం పెట్టావు అని దక్షిణమూర్తి అడిగితే.. నీ మీద గౌరవంతో పెట్టాను అంటూ సూరజ్‌ చెప్పగానే.. అదే గౌరవంతో జ్యోత్స్న మెడలో తాళి కట్టమని చెబితే కడతావా..? అంటూ దక్షిణమూర్తి అడిగితే.. సారీ తాత మన శత్రువు కూతురు మెడలో తాళి ఎలా కడతాను అంటాడు. ఏదో ఒకరోజు నువ్వే బయటపడతావులే అంటూ దక్షిణమూర్తి వెళ్లిపోతాడు.

Advertisement

దీప భోజనం తీసుకొచ్చి సుమిత్రకు తినిపిస్తుంది. జ్యోత్స్న గురించి ఆలోచిస్తారు. జ్యోత్స్న ఎక్కడకు వెల్లింది. ఏం చేస్తుందోనని ఆలోచిస్తారు. జ్యోత్స్న రాగానే రేపు ఈ విషయం గురించి ఆలోచించాలి అంటాడు. సరేనని ఇద్దరూ వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం టిఫిన్‌ బండి దగ్గర ఉన్న శివనారాయణ కార్తీక్‌ చెప్పినట్టే ఓన్లీ చట్నీలు మాత్రమే చేస్తాడు. అదే విషయం కార్తీక్‌కు చెప్పగానే.. సరే అయితే నేను చెప్పినట్టు చేయండి అంటూ ఎదురుగా మాలిని పెట్టించిన బండి దగ్గరకు వెళ్లి అక్కడ రెడీ అయ్యే టిఫిన్స్‌ మొత్తం తనకే అమ్మాలని పదివేలు అడ్వాన్స్‌ ఇస్తాడు. సరేనని టిఫిన్‌ బండి వ్యక్తి ఒప్పుకుంటాడు. దీంతో కార్తీక్‌,  దీప శ్రీధర్‌ను పిలిచి అక్కడి టిఫిన్స్‌ మొత్తం పంపిస్తాడు. ఇక ఈరోజంతా మొత్తం టిఫిన్స్‌ మాకే అమ్మాలి ఇంకెవరికీ అమ్మకూడదు అని చెప్తాడు. అక్కడ ఇరవై రూపాయలకు కొన్న టిఫిన్‌ ఇక్కడ ముఫ్పై రూపాయలకు అమ్మమంటాడు కార్తీక్‌.

ఇక శివనారాయణ వెటకారంగా కార్తీక్‌ను మెచ్చుకుంటాడు. నీ మాస్టర్‌ మైండ్‌ చాలా బాగుందిరా అప్పుడు వాళ్లతో కలిసి మమ్మల్ని మోసం చేశావు.. ఇప్పడు వీళ్లతో కలిసి వాళ్లను మోసం చేస్తున్నావు అంటాడు. అప్పుడే మాలిని వ్యక్తి వీడియో తీసి మాలినికి సెండ్‌ చేస్తాడు. వీడియో చూసిన మాలిని కోపంగా టిఫిన్‌ బండి దగ్గరకు వెళ్తుంది.  మాలిని దగ్గరకు వెళ్లిన దీప, కార్తీక్‌ తాడి తన్నేవాడు ఉంటే వాడి తల తన్నే వాడు ఉంటాడని మా తాత చెప్పాడు అంటూ కార్తీక్‌ చెప్తాడు. తాను చేసింది న్యాయమే పిన్ని అంటాడు.

Advertisement

అందుకే కష్టం నీది లాభం మాది అంటుంది దీప. కార్తీక్‌ గిరిని పిలిచి నీ చేత ఇక్కడ టిఫిన్‌ బండి పెట్టించింది ఎవరో తెలిసిపోయింది కాబట్టి రేపటి నుంచి నువ్వు ఇక్కడ కనిపించకు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. వెంటనే వెళ్లిపోతాను సార్‌ అంటాడు గిరి. తర్వాత వాళ్లకు మాలిని వార్నింగ్‌ ఇస్తుంది. మీ తాత గారు మా మామయ్య షరతులకు ఒప్పుకోవాలి. లేదంటే మాలిని అనే నీడ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అవును మీరంతా ఉన్నారు కానీ జ్యోత్స్న కనబడటం లేదు.. మీ తాత టిపిన్‌ బండి జాగ్రత్త అంటూ చెప్పి వెళ్లిపోతుంది మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

Big Stories

Advertisement
×