E-Paper
Advertisement

Supermarket : సూపర్ మార్కెట్‌లో వీటిని అస్సలు కొనొద్దు

Supermarket : సూపర్ మార్కెట్‌లో వీటిని అస్సలు కొనొద్దు
Advertisement

Supermarket : ప్యాకింగ్‌, అన్నీ ఒకేచోట లభిస్తాయి, కట్‌ చేసుకునే బాధకూడా ఉండదనే కారణంతో చాలా మంది సూపర్‌మార్కెట్‌లకు వెళ్లి వస్తువులు కొంటుంటారు. ఎక్కువశాతం సిద్ధంగా ఉన్న కోల్డ్ కట్స్‌ను కొనుగోలు చేస్తారు. వీటిని ఫ్రోజెన్ ఫుడ్స్ అంటారు. అంటే కార్న్, బ్రకోలిలాంటివి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బ్రకోలీ.. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే దీన్ని ఫ్రోజెన్ చేసినప్పుడు రుచితో పాటు ఆకృతి కూడా పోతుంది.

అందుకే దీన్ని సూపర్ మార్కెట్‌ నుంచి కాకుండా స్థానిక మార్కెట్‌లో కొనడం మంచిది. బ్రకోలీని కవర్‌లో ఉంచి గడ్డకట్టేలా చేయడంతో స్పటికాల అభివృద్ధికి దారితీస్తుంది. అందులోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. స్ట్రాబెర్రీస్‌ రుచి బాగుండటంతో ఎక్కువ మంది వీటిని కొంటుంటారు. ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి కూడా. అయితే వీటిని సీజన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ స్ట్రాబెర్రీస్ పోరస్ స్వభావం కలిగిఉంటాయి. నీటితో నిండి, ఘనీ భవించడంతో ఇవి విచ్ఛిన్నం అవుతాయి. దీంతో రుచి, ఆకృతి పోతుంది.

Advertisement

కొన్ని సందర్భాల్లో కాల్షియం క్లోరైడ్, కాల్షియం ఆస్కార్బేట్, కాల్షియం లాక్టేట్, కాల్షియం ప్రోపియోనేట్‌లాంటి ప్రిజర్వేటివ్స్ స్ట్రాబెర్రీల లైఫ్‌, టేస్ట్‌ను పెంచేందుకు వాడుతారు. కొత్తిమీర, పుదీనా వంటివాటిని కడిగి, కట్‌ చేసే ఓపిక లేదని సూపర్‌ మార్కెట్లలో తీసుకుంటారు. అయితే ఇవి గడ్డకట్ట క్రమంలో వీటి సామర్థ్యం, రుచి పోతుంది. అంతేకాకుండా కలిపి ప్యాకింగ్‌ చేయడం వల్ల లోపల తొందరగా కుళ్లిపోతాయి. అందుకే వీటిని తాజాగా తెచ్చుకోవాలి. అంతేకాకుండా బర్గర్ ప్యాటీలు, కోల్డ్ స్టోర్ నుండి నగ్గెట్స్ కొనడం తగ్గించాలి, వీలైతే ఇంట్లోనే తయారు చేసుకోవాలి.

ఎందుకంటే బయట కొంటే వాళ్లు వాడిన పిండి పదార్థాలు, ఎమల్సిఫైయర్లతో నిండి ఉంటాయి. మరోవైపు ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచికూడా పోతుంది. పుట్టగొడుగులు..సూపర్ మార్కెట్ నుండి క్లీన్ ఫ్రోజెన్ ప్యాక్ పుట్టగొడుగులు కొంటుంటాం. కానీ వీటిని ఫ్రోజెన్ చేసిప్పుడు మెత్తగా, తడిగా అవుతాయి. వీటిని తినడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే సూపర్ మార్కెట్లో లభించే ఈ ఫ్రోజెన్ ఫుడ్స్‌ను దూరం పెట్టి తాజాగా ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Tags

Related News

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Intinti Ramayanam Pallavi : ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పల్లవి.. బాబోయ్..

Big Stories

Advertisement
×