BigTV English

Education : విద్యారంగాన్ని మెరుగుపరిచే కొత్త స్ట్రాటజీ..

Education : విద్యారంగాన్ని మెరుగుపరిచే కొత్త స్ట్రాటజీ..


Egypt launches 2030 strategy

Education : సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనే కాకుండ ఇంకా ఎన్నో ఇతర విషయాల్లో కూడా చిన్నపటి నుండే అవగాహన ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అందుకే పిల్లలకి చదువుపై ఆసక్తిని పెంచడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో మార్గాలు కనిపెట్టారు. మరెన్నో స్ట్రాటజీలను కనిపెట్టడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైమరీ విద్య అభ్యసిస్తున్న వారికి మాత్రమే కాకుండా ఈ స్ట్రాటజీలు హయర్ ఎడ్యుకేషన్ వారికి ఉపయోగపడేలా తయారవుతున్నాయి.

తాజాగా ఈజిప్ట్ కూడా ఒక హయర్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ రీసెర్చ్ స్ట్రాటజీని లాంచ్ చేసింది. ఇది దేశంలోని హయర్ ఎడ్యుకేషన్ ని అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుందని ఈజిప్ట్ భావిస్తోంది. 2030 వరకు ఈజిప్ట్.. ఎడ్యుకేషన్ విషయంలో ఇతర ప్రపంచ దేశాలను దాటి ముందుకెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఈ స్ట్రాటజీని లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లాంచ్ గురించి ఈజిప్ట్ మినిస్ట్రీ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అధికారికంగా ప్రకటించింది. ఈ స్ట్రాటజీ అనేది భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈజిప్ట్ ప్రభుత్వం భావిస్తోంది.


ప్రపచవ్యాప్తంగా అన్ని రంగాల్లో పెరుగుతున్న పోటీకి ఎదురు నిలబడడానికి ఈ స్ట్రాటజీ ఉపయోగపదుతుందని ఈజిప్ట్ అంటోంది. ఇంటిగ్రేషన్, కమ్యూనికేషన్ ఇలాంటి మరో ఏడు ముఖ్య రంగాల్లో రాణించడానికి ఈ స్ట్రాటజీ సాయంగా ఉంటుంది. ఏడు ముఖ్య రంగాల్లో ముందుకి వెళ్ళడానికి మరెన్నో కార్యక్రమాలు లాంచ్ అవ్వనునట్టు తెలుస్తోంది. ఎన్నో ఎకానమిక్ యాక్టివిటీలు, అకాడమిక్ ప్రోగ్రాంలు ఇందులో భాగంగా కానున్నాయి. ఇవన్నీ కలిపి 2030 స్ట్రాటజీనీ ముందుకి తీసుకెళ్లనున్నాయి.

ఈజిప్ట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మెరుగుపరచడానికి కీలకంగా ఈ స్ట్రాటజీ ఉపయోగపడనుంది. దీనికోసం కూడా ఎన్నో ప్రత్యేకమైన ప్రోగ్రాంలు లాంచ్ కానున్నాయి. యూనివర్సిటీలని లింక్ చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇది గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలను పెరిగేలా చేస్తుంది ఆశిస్తున్నారు. అంతే కాకుండా గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ కి బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువమంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని అనుకుంటోంది ఈజిప్ట్ ప్రభుత్వం. ఈజిప్ట్ ప్రారంభించిన ఈ స్ట్రాటజీ చూసి మరెన్నో ప్రపంచ దేశాలు కూడా దీనిని ఫాలో అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×