E-Paper
Advertisement

MLC KAVITHA: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సాధించే వ‌ర‌కు పోరాటం ఆపేదేలే: ఎమ్మెల్సీ కవిత

MLC KAVITHA: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సాధించే వ‌ర‌కు పోరాటం ఆపేదేలే: ఎమ్మెల్సీ కవిత
Advertisement

MLC KAVITHA: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతమైంది. సాయంత్రం నాలుగు గంటలకు దీక్ష ముగిసింది. కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మొత్తం 18 పార్టీలు కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నాయి.

డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటామని కవిత వెల్లడించారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని.. అన్ని రాష్ట్రాల సమస్య అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాసవుతుందన్నారు. దీనిపై రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు.

Advertisement

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని అన్నారు. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. ఈ బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.

Tags

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×