BigTV English

Electric Bike : వామ్మో… ఎలక్ట్రిక్ బైక్ ధర అంతా?

Electric Bike : వామ్మో… ఎలక్ట్రిక్ బైక్ ధర అంతా?

Electric Bike : ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సూపర్ ఎలక్ట్రిక్ బైక్ దేశంలో లాంచ్ అయింది. TVS మోటార్స్ మద్దతుతో బెంగళూరులో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్… F77 పేరుతో ఈ బైక్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్, స్కూటీలతో పోలిస్తే… ఏకంగా రెట్టింపు దూరం ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉంది F77. కానీ ధరే..
గుండె గుభేల్ మనేలా ఉంది. స్టాండర్డ్‌, రెకాన్‌తో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరుతో మూడు వేరియంట్లలో ఈ బైక్‌ విడుదలైంది. స్టాండర్డ్ మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.8 లక్షలు కాగా, రెకాన్‌ వేరియంట్‌ ధర రూ.4.5 లక్షలుగా, లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌ ధర రూ.5.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీనికి ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే… ధర ఇంకా పెరుగుతుంది.


అల్ట్రా వయోలెట్ F77లో ఏకంగా 10.5 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. అందుకే దీని మైలేజ్ ఏకంగా 307 కిలోమీటర్లు అని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. F77 రెకాన్‌ మోడల్ 307 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని, F77 స్టాండర్డ్‌ వెర్షన్‌ రేంజ్‌ 206 కిలోమీటర్లు అని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీపై 8 ఏళ్ల వారెంటీ ఉంటుంది. F77 స్టాండర్డ్‌ వెర్షన్ గరిష్ఠంగా 140 కి.మీ. వేగం, రెకాన్‌ వెర్షన్‌ గరిష్ఠంగా 147 కి.మీ. వేగంతో వెళ్లగలవు. ఈ రెండు మోడళ్లతో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌లో భాగంగా కేవలం 77 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ గరిష్ఠ వేగం 152 కి.మీ. అని చెబుతోంది. అయితే మూడు బైకుల్లోనూ గ్లైడ్‌, కంబాట్‌, బాలిస్టిక్‌ రైడ్‌ మోడ్స్‌ ఉన్నాయి. ఇక ఇతర స్పెసిఫికేషన్లు చూస్తే ఎల్‌ఈడీ లైట్లు, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు, ముందూ వెనుక డిస్క్‌ బ్రేకులు, అలాయ్ వీల్స్‌, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ ఉన్నాయి.

అక్టోబర్ 23 నుంచే F77 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 10 వేల రూపాయలు చెల్లించి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. తొలి ఏడాది కాలంలో 10 వేల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత క్రమంగా F77 ఉత్పత్తిని పెంచుతూ… ఏడాదికి లక్షా 50 వేల యూనిట్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×