BigTV English
Advertisement

Forbes Asia : దానకర్ణులు.. ఈ కుబేరులు..

Forbes Asia : దానకర్ణులు.. ఈ కుబేరులు..

Forbes Asia : దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ… ఇప్పుడు మరో ఘనత సాధించారు. ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో ఆయన చోటు దక్కించుకున్నారు. అదానీతో పాటు శివ్‌ నాడార్‌, అశోక్‌ సూతా, మలేషియన్‌-ఇండియన్‌ వ్యాపారవేత్త బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి కండియా కూడా ‘ఫోర్బ్స్‌ ఆసియాస్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు.


ఈ ఏడాది జూన్‌లో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లు దానం చేస్తున్నట్లు అదానీ ప్రకటించారు. ఈ డబ్బును అదానీ ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా ఏటా దేశవ్యాప్తంగా 37 లక్షల మందికి సహాయం అందిస్తూ వస్తున్నారు… అదానీ.

ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌… తన ఫౌండేషన్‌ ద్వారా కొన్ని దశాబ్దాలుగా 8 వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చారు. ఈ ఏడాది తన ఫౌండేషన్‌కు రూ.1,160 కోట్ల మేర విరాళమిచ్చారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను కూడా శివ్ నాడార్ ఏర్పాటు చేస్తున్నారు.


సాంకేతిక దిగ్గజం, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అయిన అశోక్‌ సూతా… ఒక వైద్య పరిశోధనా ట్రస్టు ఏర్పాటు చేసి, దానికి రూ.600 కోట్ల మేర విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బును వచ్చే పదేళ్లలో ఖర్చు చేయనున్నారు. హ్యాప్పియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీలో మెజారిటీ వాటా కలిగిన ఆయన, దాని నుంచి సంపద పొందుతున్నారు. ఇప్పటికే సైంటిఫిక్‌ నాలెడ్జ్‌ ఫర్‌ ఏజింగ్‌ అండ్‌ న్యూరోలాజికల్‌ ఎయిల్‌మెంట్స్‌ పేరిట అశోక్ ఏర్పాటు చేసిన ట్రస్టు… నిరుడు పలు ప్రాజెక్టులకు రూ.20 కోట్ల నిధులిచ్చింది.

మరోవైపు… మలేషియాలో స్థిరపడిన భారతీయ జంట బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి కండియా… తమ క్రెడార్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక మందికి సాయం చేస్తున్నారు. మలేషియాలో ఒక బోధనాసుపత్రికి 11 మిలియన్ డాలర్లను ఇచ్చిన ఈ జంట… ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు కూడా 30 మిలియన్ డాలర్లను ఇచ్చారు.

Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×