Monalisa Luxurious Car: సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు? ఎలా? మారుతారో చెప్పడం కష్టం. ఒకప్పుడు పూసలు అమ్ముకున్న ఓ నిరుపేద అమ్మాయి ఇప్పుడు ఏకంగా రూ. 1 కోటి విలువ చేసే కారులో తిరుగుతోంది. ఒకప్పుడు ప్రయాణం కోసం రూ. 100 కూడా ఖర్చు పెట్టలేని యువతి ఇప్పుడు లగ్జరీ కార్లలో జర్నీ చేస్తుంది. అవును.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా దశ తిరిగిపోయింది. ఆధ్యాత్మిక వేడుకలో రూ. 100కు ఓ రుద్రాక్ష మాల అమ్మిన అమ్మాయి ఇవాళ స్టార్ గా ఎదిగిపోయింది. తాజాగా ఆమె లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందమైన చిరునవ్వుతో ఫేమస్ అయిన సాధారణ అమ్మాయి
ఒకప్పుడు మోనాలిసా చిన్న ఇంట్లో పెరిగింది. ఇంటిల్లిపాది కష్టపడితే తప్ప పూట గడవని పరిస్థితి. కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆధ్యాత్మిక వేడుకల్లో రుద్రాక్ష మాలలు అమ్మి జీవనాన్ని కొనసాగించే వారు. ఆమె కూడా కుటుంబ గడవడం కోసం రుద్రాక్ష మాలలు అమ్మేది. కొద్ది నెలల క్రితం మహా కుంభమేళాలలో ఆమె రుద్రాక్షలు అమ్ముతుండగా, ఓ యూట్యూబర్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమె చిరునవ్వు, ఆమె కళ్ళు, ఆమె నేచురల్ అందం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి.
రూ.100 సంపాదన నుంచి రూ.1 కోటి కారులో ప్రయాణం వరకు..
కొద్ది నెలల వరకు మోనాలిసా రుద్రాక్ష మాలలు అమ్మేది. ఒక్కోదానికి రూ. 100 తీసుకునేది. డబ్బులు సంపాదించేందుకు ఎంతో కష్టపడేది. ఇప్పుడు, ఆమె సూపర్ లగ్జరీ కారులో ప్రయాణిస్తోంది. ఆ కారు ఖరీదు రూ.1 కోటి కంటే ఎక్కువ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోనాలిసా తన జీవితం ఇలా మారుతుందని కలలో కూడా ఊహించి ఉండదు అని కామెంట్స్ చేస్తున్నారు.
‘సాద్గి’తో తొలి అడుగు
గాయకుడు ఉత్కర్ష్ శర్మ.. ఆమె వైరల్ ఫోటోను చూసి తన మ్యూజిక్ వీడియో ‘సాద్గి’కి సరైన నటిగా భావించాడు. ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా, ఆమె ఈ పాటకు ఒలికించిన భావాలకు అందరూ ఫిదా అయ్యారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఆల్బమ్ మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది. జూన్ 14న విడుదలైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్ముడు నటన, అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోనాలిసా ముందు బాలీవుడ్ నటీమణులు కూడా దిగదుడుపే అంటున్నారు. అటు మోనాలిసా సనోజ్ మిశ్రా రాసిన ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే బాలీవుడ్ చిత్రానికి కూడా సంతకం చేసింది. అంతేకాదు ఈవెంట్‌లు, బ్రాండ్ ప్రమోషన్లకు కూడా హాజరవుతోంది. ఇప్పుడు ఆమె ముంబైలో సొంత ఇల్లు కొనాలని భావిస్తోంది.
Read Also: ఇదేం చిత్రం.. మనిషి లేకుండా బైక్ దానంతట అదే పరుగు, వీడియో వైరల్!