E-Paper
Advertisement

Good news to Twitter users:- ట్విటర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎలన్ మస్క్..

Good news to Twitter users:- ట్విటర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎలన్ మస్క్..
Advertisement

Good news to Twitter users:- సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేతిలోకి వెళ్లినప్పటి నుండి ఎన్నో మార్పులు చేసుకుంది. తన ఐడియాలతో, మార్పులతో ట్విటర్ యూజర్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు మస్క్. ఇక తాజాగా ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ విషయంలో ఎలన్ మస్క్ మరో మార్పు చేయనునట్టు తెలుస్తోంది.

ఎలన్ మస్క్ ట్విటర్‌కు అధినేతగా మారిన తర్వాత సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రైస్‌ను బట్టి అకౌంట్లకు బ్లూ టిక్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం యూజర్ల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను బట్టి కొన్ని మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ ప్రైస్‌తో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి యాడ్స్ రావని ట్విటర్ యాజమాన్యం తెలిపింది.

Advertisement

‘ట్విటర్‌లో యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. పైగా అవి చాలా పెద్దగా ఉంటున్నాయి. ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నాం.’ అని ఎలన్ మస్క్ ట్విటర్ ద్వారా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే సబ్‌స్క్రిప్షన్ విధానం బట్టి యాడ్స్‌కు చెక్ పడనున్నట్టుగా తెలుస్తోంది. అసలు సబ్‌స్క్రిప్షన్ విధానం ఎలా ఉంటుంది, దానికి ప్రైస్ ఏంటి అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

అక్టోబర్‌లో ట్విటర్ ఎలన్ మస్క్ చేతికి వచ్చినప్పటి నుండి ట్విటర్ పూర్తిగా కమర్షియల్ అయిపోయిందని కొందరి వాదన. అందుకే కొన్ని బ్రాండ్స్ కూడా ట్విటర్‌లో వారి యాడ్స్ ఇవ్వడానికి వెనక్కి తగ్గాయి. అయినా కూడా మస్క్ నిర్ణయంలో ఏ మార్పు లేదు. ట్విటర్‌ను కమర్షియల్ జోన్ చేయాలనే ఆలోచనను మార్చుకోలేదు.

Advertisement

మూడేళ్లుగా రాజకీయపరమైన యాడ్స్ ఇవ్వకూడదు అనే పాలిసీ ట్విటర్‌లో ఉంది. కానీ మస్క్ అందులో భాగమైన తర్వాత ఈ పాలిసీని రద్దు చేశారు. అంతే కాకుండా ట్విటర్ అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే 40 మంది డేటా సైంటిస్టులను, ఇంజనీర్లను తొలగించినట్టుగా సమాచారం.

Follow this link for more updates:- Bigtv

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×