BigTV English

Google : గూగుల్‌ ఉద్యోగుల్లోనూ గుబుల్!

Google : గూగుల్‌ ఉద్యోగుల్లోనూ గుబుల్!

Google : ఆర్థిక మాంద్యం, ఆదాయాలు పడిపోతున్నాయన్న కారణంతో ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను భారీ ఎత్తున చేపట్టాయి. ఇప్పటికే ట్విట్టర్ 10 వేల మంది ఉద్యోగుల్ని, ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 13 వేల మంది ఉద్యోగుల్ని, అమెజాన్ 10 వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేశాయి. ఇప్పుడా బాటలో గూగుల్ కూడా చేరబోతోంది. సంస్థ నుంచి 10 వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతోన్న గూగుల్… సరిగ్గా పనిచేయని వారిని మాత్రమే సాగనంపేందుకు ప్లాన్ చేసింది.


గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లో మొత్తం 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 10 వేల మంది… అంటే 6 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నారని… పనితీరు సరిగా లేని వారిపైనే ఆల్ఫాబెట్‌ వేటు వేస్తోందని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. కొత్తగా తెచ్చిన ‘న్యూ ర్యాంకింగ్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌’ సాయంతో పూర్ పెర్ఫార్మెన్స్ చూపుతున్న ఉద్యోగుల్ని తొలగించాలని… మేనేజర్లను ఆల్ఫాబెట్‌ ఆదేశించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఈ తొలగింపులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులకు బోనస్‌లు, స్టాక్‌ గ్రాంట్లు తప్పించడానికి కూడా కొత్త విధానంలోని రేటింగ్స్‌ దోహదం చేస్తాయని అంటున్నారు. అయితే, ఆల్ఫాబెట్‌ మాత్రం ఉద్యోగుల తొలగింపుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ప్రస్తుతం ఆల్ఫాబెట్‌ ఒక్కొ ఉద్యోగికి ఏడాదికి సగటున 2,95,884 డాలర్లు… అంటే మన కరెన్సీలో సుమారు రూ.2.42 కోట్లు జీతం ఇస్తోంది. కానీ, సంస్థ ఆదాయం మాత్రం గణనీయంగా తగ్గింది. 2021 మూడో త్రైమాసికంలో వచ్చిన ఆదాయం కంటే… ఈ ఏడాది అదే సమయంలో వచ్చిన ఆదాయం 27 శాతం తగ్గి 13.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. దాంతో… ఆల్ఫాబెట్‌లో కూడా ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయని, అందుకే ఉద్యోగుల్ని తొలగించేందుకు రంగం సిద్దం చేస్తోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.


    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×