BigTV English

GPS:జీపీఎస్ ద్వారా భారీ వర్షపాతాన్ని కనుక్కోవచ్చు..!

GPS:జీపీఎస్ ద్వారా భారీ వర్షపాతాన్ని కనుక్కోవచ్చు..!

GPS:గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమిపై వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఒక్కొక్కసారి పర్యావరణవేత్తలు వేసే అంచనాలు కూడా తారుమారవుతున్నాయి. అనుకున్న సమయం కంటే ముందే వర్షపాతం నమోదవ్వడం, మామూలు ఉష్ణోగ్రతల కంటే ప్రతీ సంవత్సరం మరింత వేడి పెరగడం లాంటివే వీటికి ఉదాహరణలు. అయితే భారీ వర్షపాతాన్ని ముందే కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నాలజీని డెవలప్ చేయనున్నారు.


ప్రస్తుతం లొకేషన్‌ను కనుక్కోవడానికి చాలామంది గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్‌ (జీపీఎస్)ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సిగ్నల్స్ ద్వారానే భారీ వర్షపాతాన్ని 5.45 నుండి 6.45 గంటల ముందే గుర్తించవచ్చని పరిశోధకులు అంటున్నారు. కొచిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుసాట్)లోని డిపార్ట్మెంట్ ఆఫ్ జియోలజీ అండ్ జియోఫిజిక్స్ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

ఒక్కసారిగా వాతావరణంలో వాటర్ వేపర్ పెరిగిపోవడం అనేది భారీ వర్షపాతానికి ముందస్తు సూచన అని శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాకాలంలో అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ నుండి జీపీఎస్ సిగ్నల్స్.. భూమిపై ఉన్న జీపీఎస్ సిగ్నల్స్‌కు చేరుకుంటున్నప్పుడు.. ఈ వాటర్ వేపర్ వల్ల ఆ సిగ్నల్స్ భూమిపైకి రావడం కొంచెం ఆలస్యమవుతుంది. దీని ద్వారా వర్షపాతాన్ని తెలుసుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు.


తిరువనంతపురంలో ఇప్పటికే జీపీఎస్‌తో ఈ పరిశోధనలను చేశారు. జీపీఎస్ సిగ్నల్స్ ఆలస్యం అవ్వడాన్ని, వర్షం వచ్చి సమయాలను వారి పోల్చి చూశారు. దీని ద్వారా జీపీఎస్ సిగ్నల్స్ భూమిపైకి ఆలస్యంగా చేరుకోవడమే భారీ వర్షపాతానికి సూచన అని వారు నిర్ధారించారు. దాదాపు ఎనిమిది భారీ వర్షపాతాలను గమినించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. 2018 ఆగస్ట్ వరదల సమయంలో కూడా ఇలాగే జరిగిందని వారు బయటపెట్టారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×