BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, మనోజ్ ను కడిగిపడేసిన బాలు.. ప్రభావతి, రోహిణి ప్లాన్ రివర్స్.. నిజం తెలుసుకున్న మీనా..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, మనోజ్ ను కడిగిపడేసిన బాలు.. ప్రభావతి, రోహిణి ప్లాన్ రివర్స్.. నిజం తెలుసుకున్న మీనా..

Gundeninda GudiGantalu Today episode May 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం రోహిణి పార్లర్ కి వెళ్ళాలని ఆటోని పిలుస్తుంది. ఆటో డ్రైవర్ గా బాలు ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇదేంటి కారు నుంచి ఆటో కొచ్చాడే ఏం జరిగింది కార్ ఏం చేసాడో అని ఆలోచిస్తూ బాలుని ఇండైరెక్టుగా ఆటో ఏంటి అని అడుగుతుంది.. అయితే బాలు కూడా రోహిణికి అదే విధంగా సమాధానం చెప్తాడు. ఇక రోహిణికి అసలు విషయం తెలిస్తే ఇంట్లో చెప్పేస్తుందని భయపడి రాజేష్ కి ఫోన్ మాట్లాడుతూ కారు అద్దెకిచ్చిన విషయాన్ని చెప్తాడు.. రోహిణి కూడా అదే నిజమని నమ్ముతుంది. రోహిణి పార్లర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి వచ్చి బాలు కారు అమ్మేశావట ఏమైంది అని అడుగుతాడు. బాలు మాత్రం చిన్న పని ఉండి అమ్మేశానన్న అని చెప్పేసి వెళ్ళిపోతాడు పక్కనే ఉండి విన్న రోహిణి ఈ విషయం ఎలాగైనా ఇంట్లో చెప్పాలని వెళ్తుంది.. ప్రభావతికి నిజం చెప్పేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి నానా రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ కి వెళ్ళిన మీ నాకు బాలు ఆటో తోలుతూ కనిపిస్తాడు. ఇదేమైంది కారు అమ్మేసాడా లేకపోతే ఎవరికైనా ఇచ్చాడా అని ఆలోచిస్తూ ఇంటికి వెళుతుంది. ఇంట్లో ప్రభావతి అప్పటికే పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది. అయినా రాగానే ఇంకాస్త ఎక్కువగా చిందులు తొక్కుతుంది. ఈ మహారాణి అడుగుపెట్టిన తర్వాత ఓడలు బండ్లు అవుతున్నాయి కదా అందుకే కారు కాస్త ఆటో అయిందేమో అంటుంది. సత్యం బాలు చేసిన తప్పుకి మీ నాన్న అంటే ప్రయోజనం ఏంటి అని ప్రభావతిపై అరుస్తాడు. ఈ మాట నీకు తెలియకుండా ఉంటుందా అయినా కారుని అమ్మేసిన విషయం అందరికీ చెప్పాలి కదా అయినా ఇది నా ఇల్లు అమ్మినప్పుడు నాకు చెప్పాలి కదా అనేసి ప్రభావతి రెచ్చిపోతుంది.

బాలును బోన్లో పెట్టి కడిగిపడేస్తుంది. కానీ బాలు మాత్రం సమాధానం చెప్పడు. సమయం వచ్చినప్పుడు నేనే సమాధానం చెప్తానని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం ఈ ఇండ్లు నా పేరు మీద ఉంది ఏంటి పాత్రలు పెట్టే నీకు కారు కొనిచ్చాము అయితే కారు నమ్మితే వచ్చిన డబ్బుల్లో మాకు కూడా వాటా ఉంటుంది ఆ డబ్బులు ఎక్కడ చేశావు ఎక్కడికి పంపించావు అని ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. కానీ బాలు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు చెప్పలేను తర్వాత చెప్తాను. మీ డబ్బులు మీకు వచ్చేలా చేస్తాను నేను ఎక్కడికి పోను కదా అనేసి ప్రభావతి అంటాడు. ఆ అమ్మాయిని డబ్బులు ఎక్కడ పెట్టావ్ ఏంటి అని మనోజ్ అడగ్గానే నువ్వు 40 లక్షలు తెచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చావు కదా అవి తెచ్చి లైవ్ మరుక్షణమే నేను కారును అమ్మిన డబ్బులను మీ చేతిలో పెడతాను అని అంటాడు.


ఇక రోహిణి ఏదో చెప్పబోతుంటే.. ఏంటి పార్లరమ్మ ఏదో అంటున్నావు.. ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి కొన్న కారును ఎలా అమ్మేశావని, అలా అమ్మితే నీకు మూడు, నాలుగు లక్షలు వస్తాయి కదా? ఆ డబ్బులు ఇప్పుడే తిరిగివ్వాలని అంటాడు. రోహిణి కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని మండిపడుతుంది. దాంతో చిర్రెత్తిపోయినా బాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పినా వినడం లేదు కదా మీరూ.. ఇప్పుడే డబ్బులు కావాలంటే మొదట ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 40 లక్షలు ఇవ్వమని మనోజ్ ను ప్రశ్నిస్తాడు. ఆ వెంటనే తను తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇస్తానని అంటాడు.. ఇక మీనా ఏం జరిగిందో తెలుసుకోవాలని రాజేష్ దగ్గరికి వెళుతుంది.

అన్నయ్య నిన్ను నేను సొంత అన్నయ్య లాగా అనుకున్నాను.. కానీ మీరు కూడా ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదంటూ మీనా అంటుంది.. గుణకు క్యాబ్ డ్రైవర్లు డబ్బులు ఇవ్వాలని, వాడితో పాటు శివ వచ్చి డబ్బులు అడగటంతో గొడవ అయ్యిందని, అందుకే బాలు కారు అమ్మేసి మరి డబ్బులు కట్టాడని మీనాకు చెబుతాడు. దాంతో మీనా నేరుగా గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. తన భర్త తలుకుంటే నీకు బతుకు ఉండదని హెచ్చిరిస్తుంది. ఇంకోసారి తన తమ్ముడిని వెంట పెట్టుకొని తిరగొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక మనోజ్ కు అప్పు ఇచ్చిన పార్క్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×