BigTV English

HBD Hrithik Roshan : గీక్ గాడ్ హృతిక్ ఆస్తులు ఎన్నివేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

HBD Hrithik Roshan : గీక్ గాడ్ హృతిక్ ఆస్తులు ఎన్నివేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

HBD Hrithik Roshan : గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నేటితో 51వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఈ స్టార్ హీరోకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే హృతిక్ రోషన్ 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యువకుడిలా ఫిట్ గా కనిపించడం విశేషం. ఇక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హృతిక్ రోషన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. మరి ఆయన దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.


వేల కోట్లకు అధిపతి 

హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘భగవాన్ దాదా’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు హృతిక్ తాత రోషన్ దర్శకత్వం వహించగా, ఆయన తండ్రి రాకేష్ రోషన్ కీలకపాత్రను పోషించారు. ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా మారిన హృతిక్ రోషన్ ఇప్పటిదాకా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.


ఇక ఈ హీరో ఒక్కో సినిమాకు 75 నుంచి 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదు హృతిక్ రోషన్ పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలా ప్రమోట్ చేయడానికి ఒక్కో బ్రాండ్ కి 12 కోట్లు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ షేర్ చేయడానికి 4-5 కోట్లు తీసుకుంటారు. అలాగే హృతిక్ రోషన్ కి హెచ్ఆర్ఎక్స్ అనే బ్రాండ్ కూడా ఉంది. ఇందులో స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఈ కంపెనీ విలువ 200 కోట్లకు పై మాటే.

అంతేకాకుండా హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. హృతిక్ రోషన్ కి ముంబైలోని జుహూలో ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది. దాని విలువ ఏకంగా 100 కోట్లు. ఇక లోనావాలా సమీపంలో ఈ హీరోకి 7 ఎకరాల్లో వందల కోట్ల విలువైన ఫామ్ హౌస్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం హృతిక్ రోషన్ మొత్తం ఆస్తులను లెక్కేస్తే రూ. 3101 కోట్లకు పైగానే వుంటాయి.

హృతిక్ రోషన్ కార్స్ కలెక్షన్

ఇక హృతిక్ రోషన్ కు అందరు హీరోలలాగే కార్లంటే పిచ్చ క్రేజ్. ఆయన గ్యారేజీలో మెర్సిడెస్, ముస్తాన్ తో పాటు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆయనకు 3 కోట్ల విలువైన ఒక వానిటీ కూడా ఉంది.

ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ హీరో

7300 కోట్ల ఆస్తులతో షారుక్ ఖాన్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోగా మొదటి ప్లేస్ లో ఉంటే, గత 10 ఏళ్లలో కేవలం 7 సినిమాలలో మాత్రమే కనిపించిన హృతిక్ రోషన్ 3000లకు పైగా కోట్ల ఆస్తులతో భారతదేశంలోని రెండవ అత్యంత సంపన్న నటుడిగా నిలవడం విశేషం.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×