Robin Uthappa: అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెన్నిస్ ప్లేయర్ కావాలని అనుకున్న యువరాజ్ సింగ్.. క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. 18 సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తనలోని ఆల్ రౌండర్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు.
Also Read: Yuzvendra Chahal – Manish pandey: చాహల్ బాటలో మరో ప్లేయర్.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం ?
19 సంవత్సరాల పాటు భారత క్రికెట్ కి ఎన్నో సేవలు అందించాడు. ఇక 37 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. అయితే యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రస్థానం అంత సాఫీగా ఏం జరగలేదు. క్రికెట్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 2005లో మోకాలి గాయం వల్ల దాదాపు ఏడాది పాటు క్రికెట్ కి దూరమయ్యాడు. ఆ తర్వాత 2007లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే 2027 t-20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచేందుకు యువరాజ్ సింగ్ ముఖ్య కారకుడయ్యాడు.
2011 వన్డే ప్రపంచ కప్ తర్వాత క్యాన్సర్ భారిన పడడంతో మరోసారి భారత జట్టుకు దూరమయ్యాడు. క్యాన్సర్ కారణంగా చాలాకాలం జట్టుకు దూరమై.. అనంతరం మళ్లీ పునరాగమనం చేసినప్పటికీ గతంలో లాగా రాణించలేకపోయాడు. 2014 టి-20 ప్రపంచ కప్ ఫైనల్ లో బ్యాటింగ్ లో వైఫల్యం కారణంగా అతడి కెరీర్ కి ముగింపు ఆరంభమైంది. ఆ తర్వాత అడపా దడపా జట్టులోకి వస్తూ పోతూ.. చివరకు 2019లో క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణమని సంచలన ఆరోపణలు చేశాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. యువరాజ్ సింగ్ క్యాన్సర్ ని జయించి 2017లో జాతీయ జట్టులోకి వచ్చిన సందర్భంలో.. అతనికి విరాట్ కోహ్లీ నుంచి సహకారం లభించలేదని తెలిపాడు. ఫిట్నెస్ విషయంతో పాటు ఫామ్ అందుకోవడానికి యువరాజ్ సింగ్ కి విరాట్ కోహ్లీ సమయం ఇవ్వలేదన్నాడు. ఆ కారణంగానే యువరాజు సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు.
” విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి, రోహిత్ శర్మ కెప్టెన్సీ కి చాలా తేడా ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇతరులతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. అందరూ అతడి లాగానే ఉండాలని కోరుకుంటాడు. అది క్రికెట్ అయినా, ఫిట్నెస్ అయినా, పాటలు వినడం అయినా, ఏదైనా విషయాన్ని అంగీకరించడంలోనైనా అదే స్టాండర్డ్స్ పాటించాలని అనుకుంటాడు. యువరాజ్ సింగ్ కెరీర్ పై కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు తీవ్రప్రభావాన్ని చూపించింది. క్యాన్సర్ నుంచి కోల్కొని పునరాగమనం చేసిన యువరాజ్ కి అతడు మద్దతుగా నిలవలేదు.
యువరాజ్ ఫిట్నెస్ బాగానే ఉన్నప్పటికీ.. కోహ్లీ మాత్రం తన ప్రమాణాలకు తగ్గట్టుగా యువరాజ్ మారాలని ఒత్తిడి చేశాడు. వీటి గురించి ఎవరు నాకు ప్రత్యేకంగా చెప్పలేదు. నేను గమనించిన అంశాలను మాత్రమే చెబుతున్నా. యువరాజ్ లంగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఫిట్నెస్ స్థాయిని నిర్ధారించే నిబంధనలో మార్పులు చేయాలి. అప్పుడు ఆ పాయింట్లలో రెండిటిని తగ్గించాలని యువరాజ్ విజ్ఞప్తి చేసినా అందుకు కోహ్లీ అంగీకరించలేదు.
Also Read: South Africa Sports Minister: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. సౌతాఫ్రికా సంచలన నిర్ణయం !
ఆ టెస్ట్ను యువరాజ్ పూర్తి చేశాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో సరైన ప్రదర్శన చేయకపోవడంతో కెరీర్ కి వీడ్కోలు పలికాడు. నాకు కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం రాలేదు. కోహ్లీ కెప్టెన్సీ గురించి నాకు బాగా తెలుసు. అందరూ అతని దారికి రావాలి.. లేదా హైవే కి వెళ్ళాలి అనే విధంగా ఉండేది. కేవలం ఫలితాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా సహచరులతో ఎలా ఉన్నామనేది కూడా కీలకమే. ఈ విషయంలో రోహిత్ శర్మ అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలిగిన కెప్టెన్ ” అని అన్నాడు {Robin Uthappa} రాబిన్ ఉతప్ప.