Big Stories

Health Benefits of Coriander : కొత్తిమీరతో బోలెడు ప్రయోజనాలు

కూర ఏదైనా చివర్లో కొత్తమీర తగిలితే దాని టెస్టే వేరు. రుచితో పాటు చూసేందుకు కూడా ఆ వంటకం ఎంతో అందరంగా కనిపిస్తుంది. కేవలం రుచికోసమే.. అందం కోసమే కొత్తిమీర ఉందనుకుంటే పొరపాటే. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తమీర తినడం వల్ల మన రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు హైబీపీ, గుండెపోటు కూడా రాకుండా ఉంటుది. ‌అధిక రక్తపోటు ఉంటే అది టైప్ 2 డ‌యాబెటిస్‌కు దారితీస్తుంది. కొత్తిమీర తిన‌డం వ‌ల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మన బ్లడ్‌లోని షుగర్‌ లెవల్స్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్ప‌త్తిని కూడా పెంచ‌డంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీర‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అవి శ‌రీర‌ క‌ణాల‌ను రక్షిస్తాయి. కొత్తిమీర‌లో ఎలోమోల్‌, బొర్నెవోల్‌, కాంఫార్‌, కార్వోన్‌, క్వుర్సేటివ్‌లాంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. శ‌రీర క‌ణాల‌ను ఫ్రీ రాడిక‌ల్స్ దెబ్బ‌తీయ‌కుండా కాపాడుతుంటాయి. అంతేకాకుండా కొత్తిమీర ఆకులు హానిక‌ర‌మైన కొవ్వును కరిగిస్తాయి. మంచి కొవ్వును పెంచుతాయి. అధిక ర‌క్త‌పోటును కంట్రోల్‌లో ఉంచ‌టంతో పాటు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సాధారణంగా వయసు మీదపడే కొద్దీ పార్కిన్స‌న్‌, ఆల్జీమ‌ర్స్ లాంటి వ్యాధులు మన మెద‌డు ప‌నితీరును దెబ్బ‌తీస్తాయి. కొత్తిమీర‌లోని యాంటీ ఆక్సిడెంట్లు యాంగ్జైటీని చాలా వరకు త‌గ్గిస్తాయి. అంతేకాకుండా నాడీ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజం చేస్తాయి. కొత్తిమీర‌ను ప్ర‌తిరోజు తీసుకుంటే మన పేగులు క్లీన్‌ అవుతాయి. దానివల్ల జీర్ణ‌క్రియ చురుగ్గా అవుతుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం ఉంటే కొత్తిమీర‌ను తినడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. కొత్తిమీర‌లో యాంటీమైక్రోబ‌యాల్ కాంపౌండ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆహార క‌ల్తీతో వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్లను స‌మ‌ర్థ‌వంతంగా తరిమికొడతాయి. ఇందులో ఉండే డోడెసెనాల్ బ్యాక్టీరియాల‌తో పోరాడుతుంది. ఫుడ్ పాయిజ‌న్‌ నుంచి మనల్ని కాపాడుతుంది. చర్మ సమస్యలకు కూడా కొత్తిమీర బాగా పనిచేస్తుంది. దద్దుర్లు, మొటిమలు, గాయపు మచ్చలను తగ్గిస్తుంది. క‌ణాల డ్యామేజీని అడ్డుకుంటుంది. కొత్తిమీర‌లోని విట‌మిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు దృష్టి లోపాల‌ను తగ్గిస్తాయి. కొత్తిమీర‌లో కాల్షియం, మిన‌రల్స్ పుష్కలంగా ఉంటాయి. మన ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News