BigTV English

Health Tips : ఇలా చేసే నోటి దుర్వాసన పోతుంది

Health Tips : ఇలా చేసే నోటి దుర్వాసన పోతుంది

Health Tips : ప్రస్తుకాలంలో ప్రతి ఒక్కరూ నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దంతాల్లో సమస్యలు ఉన్నా లేకపోయినా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. పది మందిలో మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఎంత బ్రష్‌ చేసినా ఎన్ని మౌత్‌ ఫ్రెష్‌నర్‌లు వాడినా మాత్రం ప్రయోజనం ఉండదు. ఇంట్లో లభించేవాటితో ఈ నోటి దుర్వాసనను పోగోట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న చిట్కాలతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా మన నోట్లోని బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. పెరుగులో అధికంగా ఉండే ప్రొబ‌యోటిక్స్ మన నోట్లో ఉండే బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. అంతేకాకుండా నోరు తాజాగా కూడా మారుతుంది. గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్ స‌మ్మేళ‌నాలు నోట్లో దుర్వాస‌న‌కు కార‌ణ‌మ‌య్యే బాక్టీరియాను చంపుతాయి. నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుంటే ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా క్యాప్సికం తిన‌డంతో కూడా నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది. క్యాప్సికంలో ఉండే విట‌మిన్ సి మన నోట్లోని బాక్టీరియాను చంపుతుంది. నోటి దుర్వాసన అధికంగా ఉంటే యాపిల్ తినాలి. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. వెంటనే నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుర్ల స‌మ‌స్య‌లను పోగొట్ట‌డ‌మే కాదు, ఈ నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలోనూ ల‌వంగాలు బాగా ప‌నిచేస్తాయి. నోరు బాగా వాస‌న వ‌స్తుంటే ఒక ల‌వంగం నమిలితే స‌మ‌స్య నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. సోంపును తింటే కూడా నోటి దుర్వాస‌నను త‌గ్గించు‌కోవచ్చని నిపుణులుచెబుతున్నారు. సోంపులో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు మన నోట్లో ఉండే బాక్టీరియాను సంహరిస్తాయి. దీంతో నోరు సువాసన వస్తుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×