Electric Bike : హిందూస్థాన్ మోటార్స్. ఈ కంపెనీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది… అంబాసిడర్ కారు. కొన్ని దశాబ్దాల పాటు భారత దేశ రోడ్లపై రారాజులా తిరిగింది… అంబాసిడర్ కారు. కానీ… అనేక కొత్త కంపెనీలు, కొత్త మోడళ్లు పుట్టుకురావడం… లుక్ పరంగా అంబాసిడర్ కారు మారకపోవడంతో… దాని సేల్స్ తగ్గిపోయి… చివరికి దాని ప్లాంటే మూతపడిపోయింది. ఇప్పుడు అంబాసిడర్ కారును పూర్తిగా ఫేస్ లిఫ్ట్ చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని… ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అది నిజమో కాదో కానీ… హిందుస్థాన్ మోటార్స్ ఎలక్ట్రిక బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
2023–24లో హిందుస్థాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక బైక్ లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది… హిందుస్థాన్ మోటార్స్. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఉన్న ఉత్తరపర ప్లాంటును ఆధునీకీకరించి… ఎలక్ట్రిక బైక్ లు ఉత్పత్తి చేసేందుకు… రెండు సంస్థలు 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నాయి. సంయుక్త భాగస్వామ్యంలో కంపెనీ ఏర్పాటు చేశాక… పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పడుతుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో విజయవంతమైతే… ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి కూడా అడుగుపెడతామంటోంది… హిందుస్థాన్ మోటార్స్.