Big Stories

Twitter Employees : తీసేసినా.. వందల కోట్లు ఇవ్వాల్సిందే!

Twitter Employees : ట్విట్టర్ ను కొన్న వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా కీలక ఉద్యోగులను సంస్థ నుంచి తీసేశాడు… కొత్త యజమాని మస్క్. అయితే… వాళ్లను ఊరికే సాగనంపడానికి వీల్లేదు. ఉన్నఫళంగా సాగనంపాలంటే కచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందే. మస్క్ తీసేసిన టాప్ ఎంప్లాయిస్ అందరికీ కలిపి… మొత్తం 88 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది… మస్క్. ఇందులో ఎవరికి ఎంత వస్తుందో చూద్దాం…

- Advertisement -

2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు… పరాగ్ అగర్వాల్. ఏడాది లోపు ఆ పోస్ట్ నుంచి తీసేయాల్సి వస్తే… ఏకంగా 42 మిలియన్ డాలర్ల పరిహారం అతనికి చెల్లించాల్సి ఉంటుంది. మస్క్ తీసేసిన ఉద్యోగుల్లో అత్యధిక పరిహారం అందుకోబోతున్నది పరాగ్ అగర్వాలే. భారత కరెన్సీ ప్రకారం పరాగ్ 345 కోట్ల రూపాయలకు పైగా అందుకోబోతున్నాడు. మాజీ సీఎఫ్‌వో నెడ్ సెగల్ 25.4 మిలియన్‌ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ కు 11.2 మిలియన్ల డాలర్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత మొత్తం సిబ్బందిలో 75 శాతం మంది ఉద్యోగులను మస్క్ తొలగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే టాప్ ఎంప్లాయిస్ పై వేటు పడటంతో… కింది స్థాయి ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. దాంతో… చాలా మంది ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కొందరు గుగూల్, ఫేస్ బుక్ సహా మరికొన్ని సంస్థల్లో ఇప్పటికే చేరిపోయారు. ఉన్న వాళ్లు మాత్రం… తమ ఉద్యోగాలకు ఎప్పుడు ఎర్త్ పెడతారోనని బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News