BigTV English

Bandi Sanjay : యాదాద్రిలో తడి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం.. కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్న

Bandi Sanjay : యాదాద్రిలో తడి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం.. కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్న

Bandi Sanjay :తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినట్లే చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ గర్బగుడి ముందు నిలబడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, మరి కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.


బండి సంజయ్ యాదాద్రి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మర్రిగూడ నుంచి యాదాద్రికి వెళ్లే సమయంలో అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలను ప్రదర్శించారు. అటు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రయత్నించాయి. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఆలయ పరిసరాలతోపాటు యాదాద్రికి వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులును మోహరించారు. చివరికి బండి సంజయ్ ఆలయానికి చేరుకుని ప్రమాణం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన తర్వాత బండి సంజయ్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టే కోర్టును ఆశ్రయించామన్నారు. ఈ అంశం మునుగోడు ఉపఎన్నికతో ముడిపడి ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నందువల్లే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలంటూ కేసీఆర్ డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు రానీయడంలేదని ప్రశ్నించారు. సీసీ ఫుటేజీ, కాల్ లిస్ట్ బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయట విడుదలైన ఆడియోలు సృష్టించడానికి కేసీఆర్ కు రెండురోజుల సమయం పట్టిందని బండి సంజయ్ అన్నారు. అవి ఫేక్ ఆడియోలు అని అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ జోడించినట్లు పసలేని కేసులో ఆడియోలు జోడిస్తున్నారని కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు.


Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×