BigTV English

Iphone : దేశంలో ఐఫోన్ సరికొత్త రికార్డ్

Iphone : దేశంలో ఐఫోన్ సరికొత్త రికార్డ్

Iphone : ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తో పాటు… దసరా, దీపావళి పండుగల సీజన్లో ఇండియాలో ఐఫోన్ అమ్మకాలు దుమ్మురేపాయి. ఐఫోన్ 11, 12, 13 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో… ఈ ఏడాది ఐఫోన్ అమ్మకాలు పాత రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టాయని… ఆపీల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించాడు.


దేశంలో ఐఫోన్ అమ్మకాల ద్వారా ఈ ఏడాది కంపెనీకి అత్యధిక ఆదాయం సమకూరింది. రెండంకెల బలమైన వృద్ధితో ఇండియా ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించామని… కంపెనీ ఫలితాల వెల్లడి సమయంలో ప్రకటించాడు… ఆపిల్ సీఈవో టిమ్ కుక్. ఒక్క సెప్టెంబర్లోనే ఐఫోన్ విక్రయాల్లో 10 శాతం వృద్ధి నమోదైంది. తద్వారా 42.6 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది.

పండగ సీజన్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్… ఐఫోన్ ధరలపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. ఐఫోన్ 11ను 30 వేల నుంచి, ఐఫోన్ 12ను 40 వేల నుంచి, ఐఫోన్ 13ను 50 వేల ప్రారంభ రేంజ్ నుంచి అమ్మకానికి పెట్టడంతో… గతంలో ఎప్పుడూ ఐఫోన్ వాడని ఆండ్రాయిడ్ యూజర్లు కూడా… పెద్ద ఎత్తున ఐఫోన్లు కొనుగోలు చేశారు. దాదాపు నెల రోజుల పాటు డిస్కౌంట్ సేల్స్ సాగడం కూడా… ఐఫోన్ అమ్మకాలు భారీగా జరిగేందుకు కారణమైంది.


ఒక్క భారతే కాదు… ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ ఐఫోన్ అమ్మకాలు దుమ్మురేపాయని ఆపిల్ వెల్లడించింది. ఆగ్నేయాసియా దేశాలతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లోనూ భారీ వృద్ధి నమోదైందని ప్రకటించింది. ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో రెట్టింపు ఆదాయం సాధించింది… ఆపిల్. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో మరింత జోరుగా అమ్మకాలు సాగిస్తామనే విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది.

Tags

Related News

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×