BigTV English

Match : మ్యాచ్ ముగిశాకా.. పాక్-జింబాబ్వే ఫైట్!

Match : మ్యాచ్ ముగిశాకా.. పాక్-జింబాబ్వే ఫైట్!

Match : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ ఫైట్ ముగిసినా… రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. అది చివరికి దేశాధినేతల రేంజ్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.


మ్యాచ్ కు ముందు పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అవి చూసిన వెంటనే జింబాబ్వే అభిమాని ఒకరు స్పందించారు. క్రికెట్ తో ఏ మాత్రం సంబంధం లేని 2016 నాటి ఓ వివాదాన్ని గుర్తు చేస్తూ… మ్యాచ్ లో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ హెచ్చరించాడు. జింబాబ్వే చేతిలో ఓటమి తప్పించుకోవాలంటే వాన రాకూడదని ప్రార్థించాలని సూచించాడు. అతను అన్నట్లే పాక్ పై జింబాబ్వే గెలిచింది. అంతే… జింబాబ్వే అభిమానులు సోషల్ మీడియాలో పాకిస్థాన్ జట్టును, వారి అభిమానులను వెక్కిరించడం మొదలెట్టారు. దీనికి జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ కూడా తోడయ్యారు. జింబాబ్వే విజయం అద్భుతమన్న ఆయన… జట్టుకు అభినందనలు చెబెతూ… వచ్చేసారి నిజమైన మిస్టర్‌ బీన్‌ను పంపండి అంటూ పాక్‌ను వెక్కిరిస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ… తమ దగ్గర అసలైన మిస్టర్‌ బీన్‌ ఉండకపోవచ్చు కానీ… అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉందని కౌంటర్ ఇచ్చారు. పాక్ క్రికెట్ టీమ్ కు అద్భుతంగా పుంజుకునే తమాషా అలవాటు ఉందని ట్వీటారు. మీ జట్టు నిజంగా బాగా ఆడింది.. అభినందనలు మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ జింబాబ్వే అధ్యక్షుడికి రిప్లై ఇచ్చారు. దాంతో… అసలేంటీ మిస్టర్ బీన్ వివాదం అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

2016లో జింబాబ్వేలో నిర్వహించిన కొన్ని కామెడీ షోలకు… మిస్టర్‌ బీన్‌ను పోలి ఉండే పాక్‌ కమెడియన్ ఆసిఫ్‌ మహమ్మద్‌ను ఆహ్వానించారు… నిర్వాహకులు. కానీ… అతని ప్రదర్శన జింబాబ్వే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిజమైన మిస్టర్ బీన్ వస్తున్నాడని చాలా మంది టికెట్లు కొని కామెడీ షోకి వచ్చారని… అసలు విషయం తెలిసి మధ్యలోనే వెళ్లిపోయారని… అప్పట్లో అక్కడి మీడియా కోడైకూసింది. దాంతో… ఈ విషయంలో పాక్ ను ఓ ఆటాడుకుందామని జింబాబ్వే జనం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పాక్ పై జింబాబ్వే గెలవడంతో… పాత వివాదాన్ని గెలికి… కొత్తగా మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ విషయం తెలిశాక… ఇదేం గోలరా బాబూ అంటూ నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు.


Related News

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Big Stories

×