BigTV English

OTT Movie : ఆన్‌లైన్ డేటింగ్… జీవితాలతో నెట్వర్క్ ఆడే డెడ్లీ గేమ్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆన్‌లైన్ డేటింగ్… జీవితాలతో నెట్వర్క్ ఆడే డెడ్లీ గేమ్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక సైబర్-క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక చిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా దూసుకెళ్తోంది. ఈ స్టోరీ టెక్నాలజీ, సైబర్ నేరాలు, వ్యక్తిగత జీవితాల మధ్య తిరుగుతుంది. ఆసక్తికరంగా సాగిపోయే ఈ సిరీస్ లో శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీల నటన హైలెట్ గా నిలుస్తుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఒక మరచిపోలేని థ్రిల్ ను ఇస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

‘నెట్‌వర్క్’ (Network) 2025 లో విడుదలైన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో జులై 30, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు సతీష్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఒక హై-స్టేక్స్ థ్రిల్లర్‌గా, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల చుట్టూ తిరుగుతుంది. ఆహా ఓటీటీలో క్వాలిటీ కంటెంట్‌కు పేరుగాంచిన ఈ సిరీస్, సీట్-ఎడ్జ్ సస్పెన్స్, ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. IMDbలో 7.8/10 రేటింగ్‌తో, ఈ సిరీస్ శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీల నటన, ఆధునిక సైబర్ థీమ్‌ల కోసం ప్రశంసలు అందుకుంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ హైదరాబాద్‌లో జరుగుతుంది. అర్జున్ (శ్రీకాంత్ శ్రీరామ్) ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. తన కెరీర్‌లో మంచి పొజిషన్ లో ఉంటాడు. కానీ అతని వ్యక్తిగత జీవితం ఒడిదొడుకులతో ఉంటుంది. అతని భార్య సుమిత్ర (కామ్నా జెఠ్మలానీ) ఒక జర్నలిస్ట్. డిజిటల్ మోసాల గురించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీలపై పని చేస్తుంటుంది. వీళ్ళ జీవితాలు సంతోషంగా గడుస్తుంటాయి. ఒక రోజు అర్జున్ కు ఒక అపరిచిత హ్యాకర్ బెదిరిస్తూ ఒక సందేశం పంపుతాడు. ఆ వ్యకి అర్జున్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు. అదే సమయంలో సుమిత్ర తన ఇన్వెస్టిగేషన్‌లో ఒక పెద్ద సైబర్ క్రైమ్ రాకెట్‌ను బయటపెడుతుంది. ఇది హై-ప్రొఫైల్ వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాకెట్ డార్క్ వెబ్ ద్వారా ఫైనాన్షియల్ స్కామ్‌లు, డేటా థెఫ్ట్, బ్లాక్‌మెయిలింగ్‌ పనులు చేస్తుంటుంది. ఆమె ఈ కేస్‌ లో డీప్ గా వెళ్ళడంతో ఆమె జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. అర్జున్, సుమిత్ర ఈ సమస్యలను ఎదుర్కొంటూ, వారి స్నేహితుడు రాజ్ (శ్రీనివాస్ సాయి), ఒక టెక్ జీనియస్, ప్రియా (ప్రియా వడ్లమాని) ఒక డిటెక్టివ్ సహాయం తీసుకుంటారు. వీరంతా కలిసి ఈ సైబర్ నేరస్థులను ఎదిరించడానికి ప్రయత్నిస్తారు.

Read Also : కాల్ సెంటర్ లో రొమాంటిక్ చాట్… సీను సీనుకో ట్విస్ట్… క్లైమాక్స్ హైలెట్ మావా

కథలో ట్విస్ట్ ఏమిటంటే అర్జున్, సుమిత్రల వ్యక్తిగత జీవితాలు, ఈ సైబర్ థ్రెట్‌లతో ముడిపడి ఉంటాయి. అర్జున్ గతంలో చేసిన ఒక పని, ఈ హ్యాకర్‌తో సంబంధం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇది అతని కుటుంబాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. సుమిత్ర జర్నలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, ఆమెను ఒక అండర్‌వరల్డ్ ఫిగర్‌తో ఢీ కొట్టేలా చేస్తుంది. ఇతను ఈ సైబర్ నెట్‌వర్క్‌ను నడిపిస్తుంటాడు. ఇప్పుడు ఈ సిరీస్ ఒక క్యాట్-అండ్-మౌస్ గేమ్‌లా సాగుతుంది. సుమిత్ర తన జర్నలిస్టిక్ నైపుణ్యంతో ఈ క్రైమ్ రాకెట్‌ను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చేసే ఒక మిస్టేక్, ఆమెతో పాటు అర్జున్‌ను కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. చివరి ఎపిసోడ్ ఒక ఉత్కంఠభరితమైన షోడౌన్‌తో ముగుస్తుంది. అర్జున్‌ గతంలో చేసిన మిస్టేక్ ఏమిటి ? అతన్ని ఎవరు బెదిరిస్తుంటారు ? సుమిత్ర అండర్‌వరల్డ్ నుంచి వచ్చే ముప్పును ఎలా ఎదుర్కొంటుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×