Rajinikanth Coolie Censor Report:సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆగష్టు 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా విడదల కానుంది. దీంతో ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమానలు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా శుక్రవారం(ఆగష్టు 1) ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో భారీ యాక్షన్, రక్తపాతం ఉండటంతో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ సినిమాకు అనుమతి లేదని హెచ్చరించింది. కేవలం పెద్దలు మాత్రమే చూడాలని ఆదేశిస్తూ A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ఉంది.
గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యం..
మొదటి నుంచి ఈ మూవీ మంచి బజ్ నెలకొంది.లోకేష్ కనగరాజ్ సినిమా అంటే అందులో యాక్షన్స్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. డ్రగ్స్, గన్స్ చూట్టూ సాగే కథలను ఎలివేషన్ ఇచ్చి వెండితెరపై ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తాడు. అలాగే రక్తపాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయన సినిమాలన్ని గ్యాంగ్స్టర్ నేపథ్యంలో భిన్నంగా ఉంటాయి. అందుకే లోకేష్ సినిమాలంటే యూత్ పడి చచ్చిపోతారు. ఇప్పటికే విక్రమ్, లియో వంటి చిత్రాలతో ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలు కూడా భారీ విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు కూలీతో మరోసారి థియేటర్లలో రచ్చ చేయబోతున్నాడు.
కూలీ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఈ సినిమాను లోకేష్ ఏ రేంజ్లో ప్లాన్ చేశాడో అర్థమైపోతుంది.. స్క్రీన్పై రక్తపాతమే అంటూ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్లో నటిస్తున్నారు. సిమోన్ అనే గ్యాంగ్స్టర్ కనిపించబోతున్నారు. ఇక కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో పోషిస్తున్నారు. మూవీ చివరల్లో బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో శ్రుతీ హాసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. పలువురు అగ్ర నటులు ఈ సినిమా భాగం కావడంతో ముందు నుంచి కూలీపై విపరీతమైన బజ్ నెలకొంది.
స్పెషల్ సాంగ్ లో మెరవనున్న బుట్టబొమ్మ
ప్రస్తుతం సౌత్లో వార్ 2 కంటే కూడా కూలీకే ఎక్కువ హైప్ ఉండటం గమనార్హం. ఆగష్టు 14న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడనున్నాయి. మరి ఇందులో ఎవరిదీ పైచేయి అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ క్రూరమైన విలన్ రోల్లో భయపెట్టబోతున్నారట. ఖరీదైన బంగారు వాచీలు, స్మంగ్లింగ్ చూట్టు ఈ కథ సాగుతుంది అట. ఇక ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో కనిపించబోతుందని సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ‘కూలీ’ మూవీకి తెలుగులో భారీ బిజినెస్ చేసుకుందట. ఇక రేపు ఆగస్టు 2న ‘కూలీ’ ట్రైలర్ రిలీజ్ కానుంది.