
kill switch : కేన్సర్‌ను తుదముట్టించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కేన్సర్ కణాలను చంపేసే ‘కిల్ స్విచ్’ను యూసీ డేవిస్ పరిశోధకులు కనుగొన్నారు. ఓ ప్రొటీన్ రెసిప్టార్‌కు కేన్సర్ కణాలను చంపేసే గుణం ఉన్నట్టు శాక్రిమెంటోలోని యూసీ డేవిస్ కాంప్రిహెన్సివ్ కేన్సర్ సెంటర్ పరిశోధనలో బయటపడింది.
సీడీ95 రెసిప్టార్‌ను డెత్ రెసిప్టార్‌గా వ్యవహరిస్తారని యూసీ డేవిస్ శాస్త్రవేత్తలు తెలిపారు. సెల్ మెంబ్రేన్లలో సీడీ95 రెసిప్టార్లు ఉంటాయి. వీటిని Fas అని కూడా వ్యవహరిస్తారు. ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఓ సంకేతం వెలువడుతుంది. దాని వల్ల కేన్సర్ కణాలు వాటంతట అవే నాశనమవుతుంటాయని పరిశోధకులు తెలిపారు.
దీనికి వారు CAR T-cell థెరపీ అని పేరుపెట్టారు. థెరపీలో భాగంగా బాధితుడి రక్తంలోని టీ-కణాలను సేకరిస్తారు. కైమీరిక్ యాంటీజెన్ రెసిప్టార్లను(CARs) ఉత్పత్తి చేసేలా ఆ టీ-సెల్స్‌కు లాబొరేటరీలో జన్యుపరమైన మార్పులు చేస్తారు.
జన్యుమార్పిడి అనంతరం ఆ కణాలను తిరిగి కేన్సర్ బాధితుడి శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ థెరపీతో లుకేమియా, ఇతర బ్లడ్ కేన్సర్లను సమర్థంగా తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. అయితే బ్రెస్ట్, లంగ్, బౌల్ కేన్సర్ల విషయంలో అంతగా ఫలితాలు ఉండవని చెబుతున్నారు.
Udhayanidhi Stalin on BJP: చెత్త.. విషసర్పం.. మరోసారి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్..