KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్ను పూసకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తెలిపారు.
స్లిప్ డిస్క్ కారణంగా తీవ్ర నొప్పి వస్తుండటంతో డాక్టర్లను సంప్రదించానని చెప్పారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గాయం నుండి పూర్తిగా కోలుకోవడం కోసం బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించినట్టు తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
Also Read: BRS Public Meeting: కేసీఆర్ సభ.. రైతుల భూములు ఛిద్రం, పాపం వీరి కష్టం ఎవరికీ రాకూడదు!