OTT Movie : తక్కువ టైమ్ లో రిచ్ కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దీనివల్ల అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటారు. ఈరోజు మన మూవీ సజెషన్ దీని గురించే. కాకపోతే ఈ అంశానికి హర్రర్, సస్పెన్స్ తోడైతే ఎలా ఉంటుందో, ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
మూవీ కాదు సిరీస్
ఇండోనేషియన్ దర్శకుడు జోకో అన్వర్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్, సూపర్‌న్యాచురల్ హారర్ మిస్టరీ ఆంథాలజీ సిరీస్ ‘నైట్‌మేర్స్ అండ్ డేడ్రీమ్స్’ (Nightmares and Daydreams). 2024 జూన్లో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ ఏడు ఇంటర్‌కనెక్టెడ్ ఎపిసోడ్‌లతో ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. జకార్తాలో మూడు దశాబ్దాల కాలంలో సామాన్య వ్యక్తులు అసాధారణ ఫినామినాను ఎదుర్కొనే సంఘటనల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ కథలు ఇండోనేషియా సామాజిక, రాజకీయ సమస్యల నుండి ప్రేరణ పొందాయి.
అగర్తా అనే పౌరాణిక రాజ్యంతో లింకు అవుతాయి. ఇది భూమి ఉపరితలం, నరకం మధ్య ఉన్న ఒక రహస్య ప్రపంచం. ఇందులో ఆరియో బాయు, మారిస్సా అనితా, అస్మారా అబిగైల్, లుక్మాన్ సర్ది, యోగ ప్రతమ, ఫచ్రి అల్బర్, సితా నర్సంతి వంటి ఇండోనేషియన్ నటులు నటించారు. జోకో అన్వర్‌తో పాటు రే ఫరాండీ పాక్‌పహన్, టామీ డెవో, రాండోల్ఫ్ జైనీ డైరెక్ట్ చేశారు.
సిరీస్‌లోని ఏడు ఎపిసోడ్‌లు డిఫరెంట్ స్టోరీతో నడుస్తాయి. కానీ అవన్నీ అగర్తా రాజ్యం, అసుర జాతితో ముడిపడి ఉంటాయి. చివరి ఎపిసోడ్‌లో ఈ కనెక్షన్ స్పష్టంగా వెల్లడవుతుంది. ప్రతి ఎపిసోడ్ సామాజిక సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక నిరాశ వంటి అంశాలతో, సై-ఫై, హారర్ ఎలిమెంట్స్‌తో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో ఏలియన్ కాన్సెప్ట్‌లు, లవ్ క్రాఫ్టియన్ హారర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌ను మిళితమై ఉంటాయి.
ఓల్డ్ హౌస్ (Old House): ఒక టాక్సీ డ్రైవర్ అతని వృద్ధ తల్లిని అతి సంపన్నుల కోసం ఒక రహస్య నర్సింగ్ హోమ్‌లో చేర్చుతాడు, కానీ అది చీకటి రహస్యాన్ని దాచి ఉంచుతుంది.
ది ఆర్ఫన్ (The Orphan): ఒక పేద దంపతులు ఆరు రోజులలో సంపద తెచ్చే అసాధారణ శక్తి ఉన్న ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకుంటారు. కానీ ఏడవ రోజున భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి.
పోయెట్స్ డే (Poets Day): ఒక రచయిత్రి తన తాజా నవలను పూర్తి చేయడానికి కష్టపడుతున్నప్పుడు, ఆమె జీవితం తాను రాస్తున్న పాత్ర జీవితంలా మారడం ప్రారంభమవుతుంది. తరువాత ఏం జరిగింది ? అన్నది స్టోరీ.
ఎన్‌కౌంటర్ (Encounter): బహిష్కరణ ఎదుర్కొంటున్న ఒక ఫిషర్‌మెన్ సమాజం, రాత్రిపూట ఆకాశంలో ఒక రహస్య వస్తువు ఫోటో తీసిన ఒక ఒంటరి వ్యక్తి నుండి సమాధానాలు కోరుతుంది.
ది అదర్ సైడ్ (The Other Side): ఒక వ్యక్తి గతంలో తాను ఉద్యోగం చేసిన ఒక పాడుబడిన సినిమా థియేటర్‌కు వెళ్తాడు. అక్కడ అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చే అనుభవం ఎదురవుతుంది.
హిప్‌నోటిక్స్ (Hypnotics): ఒక ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ డబ్బు సంపాదించడానికి హిప్నాటిజం నేర్చుకుంటాడు. కానీ అతని చర్యల వల్ల ఊహించని పరిణామాలను ఎదుర్కొంటాడు.
పీ.ఓ. బాక్స్ (P.O. Box): ఈ ఫైనల్ ఎపిసోడ్ అన్ని కథలను అగర్తా రాజ్యంతో లింకు చేస్తుంది. డెమీ-గాడ్స్ (అసురులు) నివాసమైన ఈ రాజ్యం, అందులో నివసిస్తున్న అసురులు మానవ ప్రపంచంలోని సంఘటనలను ప్రభావితం చేస్తారు. చివరికి వచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది.