BigTV English

Chandrayaan-3 Mission : సేఫ్ రూట్ కోసం రోవర్ చక్కర్లు.. వీడియో పంపిన ల్యాండర్..

Chandrayaan-3 Mission : సేఫ్ రూట్ కోసం రోవర్ చక్కర్లు.. వీడియో  పంపిన ల్యాండర్..

Chandrayaan-3 Mission : చంద్రయాన్ -3 మిషన్ కు సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ప్రజ్ఞాన్‌ రోవర్ వీడియోను విక్రమ్ ల్యాండర్ తీసింది. తాజాగా ఈ దృశ్యాలను ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది. సరైనమార్గం కోసం రోవర్ తిరుగుతూ చర్చ్ చేస్తుండగా ల్యాండర్ ఈ వీడియోను తీసింది.  తల్లి (ల్యాండర్) గమనిస్తుంటే చందమామ పెరట్లో చిన్నారి (రోవర్) సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉందంటూ ఇస్రో పేర్కొంది.


ఆగస్టు 30న ల్యాండర్ విక్రమ్ ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది. ఈ ఫోటో ఆసక్తిరేపింది. మరోవైపు చంద్రునిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఇస్రో వెల్లడిస్తోంది. ఇప్పటికే ల్యాండర్, రోవర్ చంద్రుడిపై దిగి 9 రోజులు అయ్యింది. మరో 5 రోజులు చంద్రుడిపై పరిశోధనలు సాగనున్నాయి. అక్కడ ఉన్న ఖనిజాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. రోవర్ ఈ పనిని చేస్తోంది.

సెప్టెంబర్ 5 తర్వాత చంద్రుడిపై చీకటి పడుతుంది. దీంతో ఉష్ట్రోగతలు బాగా పడిపోతాయి. ఆ తర్వాత 14 రోజులకు మళ్లీ వెలుతురు వస్తుంది. అప్పటికి ల్యాండర్ , రోవర్ మళ్లీ పనిచేస్తే మరో 14 రోజులు పరిశోధనలు కొనసాగుతాయి. అవి పనిచేయకపోతే చంద్రయాన్-3 మిషన్ ముగుస్తుంది.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×